హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇంటి వద్ద.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీకి జగన్ సీఎం అయ్యాక మతమార్పిడులు, ఆలయాలపై దాడులు పెరిగాయంటూ.. భజరంగ్ దళ్ నిరసనకు దిగింది. లోటస్‌పాండ్‌లోని జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు.
సుమారు 300 మంది పోలీసులను జగన్ ఇంటి వద్ద మోహరించారు. లోటస్‌పాండ్‌కు సుమారు 200 మీటర్ల దూరంలో.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో భజరంగ్‌దళ్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. వారిని పోలీసులు అరెస్టు చేశారు.