ETV Bharat / city

విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రధానికి ఏపీ సీఎం జగన్‌ లేఖ - vizag steel plant latest news

ఏపీలోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్మోహన్​రెడ్డి‌ లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ

author img

By

Published : Feb 6, 2021, 10:37 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్మోహన్​రెడ్డి‌ లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ద్వారా 20 వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా విశాఖ స్టీల్​ ఫ్యాక్టరీ ఏర్పడిందని వివరించారు. దశాబ్దం పాటు ప్రజలు పోరాటం చేశారని, నాటి ఉద్యమంలో 32మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 2002-15 మధ్య వైజాగ్‌ స్టీల్‌ మంచి పనితీరు కనబరిచిందన్నారు. ఈ ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల భూములు ఉన్నాయని.. వాటి విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని వివరించారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరగడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయని చెప్పారు. స్టీల్‌ ప్లాంటుకు సొంతంగా గనుల్లేవని సీఎం ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

గతేడాది రూ.200 కోట్ల లాభాలొచ్చాయ్‌..

‘‘కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడటం ద్వారా ప్లాంట్‌ను ప్రగతిబాటలో తీసుకెళ్లొచ్చు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 7.3మిలియన్‌ టన్నులు. 6.3మిలియన్‌ టన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నాం. డిసెంబర్‌ 2020లో రూ.200 కోట్ల మేర లాభం కూడా వచ్చింది. వచ్చే రెండేళ్లలో ఇలాగే కొనసాగితే ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది’’ అని జగన్​ తెలిపారు.

గనులు కేటాయించండి..
బైలదిల్లా నుంచి ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోంది. దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ.5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఫలితంగా టన్నుకు అదనంగా రూ.3,472లు భారం పడుతోంది. సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌ వద్ద ఉన్నాయి. వైజాగ్‌ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. గనుల కేటాయింపుతో పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి ప్లాంటును తీసుకెళ్లొచ్చు. బ్యాంకుల రుణాలను వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుందని లేఖలో సీఎం సూచించారు.

ఇదీ చూడండి: 'రైతులకు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టం రానివ్వరు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.