ETV Bharat / city

ఈ-రక్షాబంధన్​తో మహిళలకు రక్ష: ఏపీ సీఎం జగన్ - e- raksha bandhan portal news

మహిళలపై సైబర్‌ నేరాల నిరోధానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. సైబర్‌ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా 'ఈ- రక్షాబంధన్' పేరుతో పోర్టల్​ను ప్రారంభించింది. దీనిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.

cm-jagan-launched-e-raksha-bandhan-program
ఈ-రక్షాబంధన్​తో మహిళలకు రక్ష: ఏపీ సీఎం జగన్
author img

By

Published : Aug 3, 2020, 7:08 PM IST

మహిళల రక్షణ కోసం 'ఈ– రక్షా బంధన్‌' కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ప్రారంభించారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దీనిని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు, ఉద్యోగినులు సీఎంకు రాఖీ కట్టారు. అనంతరం ఈ- రక్షాబంధన్​ను సీఎం ప్రారంభించారు.

నిపుణులతో అవగాహన

రాఖీ పండుగ సందర్భంగా రెండు కార్యక్రమాలు మొదలుపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇదివరకే అమూల్‌తో ఒప్పదం చేసుకోగా...సోమవారం వైయస్సార్‌ చేయూత, ఆసరా కార్యక్రమాలకు సంబంధించి హిందుస్థాన్‌ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్‌ గాంబల్, ఐటీసీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రాఖీ పండుగ రోజున మరో కార్యక్రమం కింద 4s4u.appolice.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్‌ ఛానల్లో రకరకాల నిపుణులతో అవగాహన కల్పిస్తారన్నారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉన్నందున వీటి వల్ల మంచి, చెడు ఏంటి?. సైబర్‌, వైట్‌కాలర్‌ నేరాలు జరిగితే ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై ఈ రక్షా బంధన్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తారు. ఏ యాప్‌ల వల్ల ఇబ్బందులు వస్తాయో వివరిస్తారు. నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలన్న దానిపైనా అవగాహన కల్పిస్తారు. మహిళలు దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవడం, దిశ కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేయడం, సైబర్‌మిత్ర వాట్సాప్‌ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చు. ఇవి కాకుండా దిశ పోలీస్‌ స్టేషన్లలోనూ ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్య తీసుకుంటారు. తద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుంది- జగన్, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి: 'కరోనా వస్తే పెద్దోళ్లకు చేసే వైద్యమే పేదోళ్లకూ అందించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.