ETV Bharat / city

'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు - జగనన్న తోడు పథకం తాజా వార్తలు

చిరు వ్యాపారులు సమాజానికి చేస్తున్న సేవ మహనీయమైనదని ఏపీ సీఎం జగన్ కొనియాడారు. గతంలో వారికి రుణాలు అందేవి కాదన్నారు. తమ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి రూ. 10 వేల రుణం ఇస్తామని చెప్పారు. జగనన్న తోడు పథకం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాలు వెల్లడించారు.

'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు

author img

By

Published : Nov 25, 2020, 3:07 PM IST

పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాన్ని చూశానని ఏపీ సీఎం జగన్ అన్నారు. వారికి శ్రమ ఎక్కువ, లాభం తక్కువ ఉండేదని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 'జగనన్న తోడు' పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. చిరువ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని నిర్ణయించామన్నారు. 9.05 లక్షల మంది చిరువ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 905 కోట్లను సీఎం జగన్ జమ చేశారు.

చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు రుణం అందిస్తాం. లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించాం. గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. ప్రతి వార్డు, గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు పూర్తి బాధ్యత ఇస్తున్నాం. దరఖాస్తులో సమస్యలు ఎదురైతే గ్రామ వాలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు పరిష్కరిస్తారు.

- వైఎస్ జగన్, ఏపీ ముఖ్యమంత్రి

'ఆత్మగౌరవంతో అమూల్య సేవలందిస్తున్న మహనీయులు చిరు వ్యాపారులు. వారు లేకపోతే జనం బతుకు బండే కాదు. ఆర్థిక వ్యవస్థ కూడా నడవదు. రూ.3 నుంచి రూ.10 వడ్డీతో వ్యాపారాలు చేసుకునే పరిస్థితి చిరువ్యాపారులది. అలాంటి వారిని ఆదుకుంటాం' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఎవరికీ అందలేదు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.