దిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రెండ్రోజుల పర్యటన నిమిత్తం దిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రులతో వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసిన జగన్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అంతకు ముందు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు.
అనంతరం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌తో జగన్ భేటీ అయ్యారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు.
రేపు ఉదయం వాణిజ్య, రైల్వే, పెట్రోలియం శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. రాత్రికి దిల్లీలోనే బస చేయనున్న ఏపీ సీఎం.. రేపు మధ్యాహ్నం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, మోపిదేవి వెంకటరమణ సహా మరికొందరు ఎంపీలు ఉన్నారు.
ఇదీ చదవండి: దిల్లీకి యూపీ సీఎం యోగి- అందుకేనా?