ఆంధ్రప్రదేశ్లో వైకాపా రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా సీఎం జగన్ (CM Jagan) పుస్తకం విడుదల చేశారు. రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరాయని జగన్ అన్నారు. ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ.95,528 కోట్లు జమ చేయగా... పరోక్షంగా మరో రూ.36,197 కోట్లు మందికి లబ్ధి చేకూర్చమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాలపై 2 డాక్యుమెంట్లు విడుదల చేస్తున్నామన్న సీఎం.. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరే కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం పూర్తిచేసినట్లు జగన్ వెల్లడించారు. ప్రభుత్వానికి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: corona : కరోనాతో నాన్న.. ప్రసూతి కోసం వెళ్లి అమ్మ మృతి