వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది 80,032 మంది నేతన్నలకు.. ఈ పథకం ద్వారా సహాయం అందనుందని తెలిపారు. ప్రస్తుతం రూ.192 కోట్లు వారి ఖాతాల్లో జమచేశారు.
గడచిన రెండేళ్లలో...
గడచిన రెండేళ్లలో నేతన్న నేస్తం కింద చేనేతల కుటుంబాలకు రూ. 383 కోట్ల 99 లక్షల ఆర్థిక సాయం అందించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. చేనేతలకు మూడు విడతల్లోనూ రూ. 576 కోట్లను అందించినట్టు స్పష్టం చేశారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని నేతన్నలు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఇదీ చూడండి: KRMB, GRMB: 'గెజిట్‌లోని అభ్యంతరాలపై కేంద్రాన్ని సంప్రదించండి'