Bhatti Vikramarka letter to CM KCR: గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిన ఆయన... గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని విన్నవించారు. మౌలిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని... పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించాలన్నారు. పాఠశాలలు ప్రారంభమై 4 నెలలైనా పుస్తకాలు అందలేదని గుర్తుచేశారు. త్వరలో గురుకుల, ప్రభుత్వ హాస్టల్స్, జూనియర్ కళాశాలలు సందర్శించనున్నట్లు భట్టి తెలిపారు.
ఇవీ చదవండి: