దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసేందుకు... రాజస్థాన్లో కుట్ర రాజకీయాలకు తెర లేపిందని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను కాపాడి... పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాలని వ్యాఖ్యానించారు.
భారతీయ జనతా పార్టీ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీలను ఉసి గొలిపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భాజపా విధానాలపై శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రాజ్ భవన్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు