ETV Bharat / city

'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి' - telangana assembly meeting

ధరణి పోర్టల్‌ను ఎవరైనా హ్యాక్‌ చేస్తే పరిస్థితి ఏంటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త రెవెన్యూ చట్టంపై చర్చలో భాగంగా ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు చేశారు. చట్టంలోని పలు సమస్యలను సవివరంగా సభముందుంచిన భట్టి విక్రమార్క... అన్ని సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రస్తుత విధానాన్నే అమలు చేయాలని కోరారు.

'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి'

author img

By

Published : Sep 11, 2020, 2:17 PM IST

'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి'

ధరణి వెబ్​సైట్​ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదని... కొత్త రెవెన్యూ చట్టంలోనూ లోపాలు ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మ్యుటేషన్‌లో ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని భట్టి ఆరోపించారు. క్షేత్రస్థాయిలో భూమికి, రికార్డుల్లో నమోదైన వివరాల్లో తేడాలు ఉన్నాయని ఆరోపించారు. భూప్రక్షాళన సమయంలో రికార్డుల్లో సైతం తప్పుడు వివరాలు నమోదయ్యాయని తెలిపారు.

మ్యానువల్​గా కూడా నమోదు చేయాలి...

ధరణీ వెబ్​సైట్​ ద్వారా భూరికార్టుల వివరాలు మొత్తం డిజిటలైజేషన్​ చేయటం వల్ల కొంతమేర లాభం చేకూరినా... నష్టం కూడా పొంచి ఉందని వివరించారు. భూరికార్డుల వివరాలను మ్యానువల్​గానూ నమోదు చేస్తేనే భద్రంగా ఉంటాయన్నారు. డిజిటలైజేషన్​ వల్ల వెబ్​సైట్​ని హ్యాక్​ చేయటం లాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరారు.

ధరణీ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదు...

భూసమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ కోర్టులను రద్దు చేసి ట్రైబ్యూనల్ ఏర్పాటు చేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందిపడుతారన్నారు. రెవెన్యూ కోర్టుల వల్ల అధికారులకు రైతులు తమ సమస్యలు వివరించుకోలుగుతారన్నారు. ట్రైబ్యూనల్స్​లో న్యాయవాదులను నియమించుకుని సమస్య పరిష్కరించుకునే స్థోమత రైతుల దగ్గర ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ధరణి వెబ్​సైట్​లో చాలా వరకు లోపాలున్నాయని... వాటన్నింటిని పరిష్కరించాల్సి ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ధరణి వెబ్​సైట్​లోని సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు పాత రెవెన్యూ విధానాన్ని కొనసాగించాలని సూచించారు.

ఇదీ చూడండి: 'ఈ చట్టంతోనైనా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.