ETV Bharat / city

'రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుంది' - రైస్ మిల్లర్లు, అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష

రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. రైస్ మిల్లర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి... రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు.

civil supply minister gangula kamalakar review on paddy procurement
రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: గంగుల
author img

By

Published : Nov 9, 2020, 4:52 PM IST

Updated : Nov 10, 2020, 6:12 AM IST

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2020-21 వానాకాలం మార్కెటింగ్ సీజన్‌లో భాగంగా ధాన్యం సేకరణ సంబంధించి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో రైస్ మిల్లర్లు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఇటీవల కురిసిన వర్షాలతో వరి సన్న రకాలకు దోమపోటుతో రంగు మారిన ధాన్యం కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తాలు, మట్టి పెళ్లలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు సన్నరకం వరి సాగు చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా 6491 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పౌరసరఫరాల శాఖ... ఇప్పటి వరకు 3074 కేంద్రాలు తెరిచి 4.23 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 93 వేల మెట్రిక్ టన్నుల సన్నరకాలు, 3.30 మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలను కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. ఈ ఏడాది వానాకాలం గణనీయమైన పంట దిగుబడులకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున రైస్ మిల్లర్లు అందుకు సహకరించాలని మంత్రి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మిల్లర్లు సమస్యలు సర్కారు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

రైస్‌ మిల్లర్ల సమస్యలపై ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్‌తో మాట్లాడి రవాణ సమస్య పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. రైతులు సన్న రకాలను తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు. సీఎం ఆదేశాల మేరకు సన్న రకాలకు కనీస మద్ధతు ధర రూ.1888 రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్​సీఐ జనరల్ మేనేజర్ అశ్విన్ కుమార్ గుప్తా, రైస్ మిలర్ల సంఘం రాష్ట్ర ప్రతినిధులు, జిల్లా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: జవాన్ మహేష్ కుటుంబానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి పరామర్శ

Last Updated : Nov 10, 2020, 6:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.