కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (CISCE)... 10, 12 తరగతుల మొదటి టర్మ్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తమ పరిధిలో లేని సమస్యల వల్ల వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
"2021-22 సెషన్‌కు CISCE క్లాస్ 10, 12 తరగతుల మొదటి సెమిస్టర్ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. నిర్ణీత సమయంలో సవరించిన షెడ్యూల్‌ను అందరికీ తెలియజేస్తాం" అని బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ సెక్రటరీ గెర్రీ అరథూన్ ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షలు నవంబర్ 15 నుండి ప్రారంభం కావాల్సి ఉండగా ప్రస్తుతానికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి : విమానంలో నటిపై వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్
ఇదీ చదవండి : కోర్టులో పరువునష్టం దావా వేసిన సమంత