Movie tickets issue in AP: సినిమా టికెట్ల ధరల విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించేందుకు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు సమస్యలు చెప్పుకొనేందుకు తమకు సమయం ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని కోరారు. సినిమా థియేటర్ల రేట్లపై పలువురు సినీ హీరోల వ్యాఖ్యలతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలకు తామే వస్తామని.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిద్ధమని మంత్రికి తెలపగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
రేపు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రి పేర్ని నానిని.. థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కలవనున్నారు. భేటీలో సినిమా థియేటర్లలో టికెట్ ఛార్జీలు సహా తినుబండారాల రేట్ల నియంత్రణ, తనిఖీలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: Rythu bandhu Scheme: రైతులకు తీపి కబురు.. రేపట్నుంచే రైతుబంధు నిధుల పంపిణీ