ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోవూరు వద్ద షూటింగ్ కు వచ్చిన సినిమా బృందం వరద నీటిలో(Cine crew trapped in flood) చిక్కుకుంది. నటుడు నవీన్ కుమార్.. వరదల్లో చిక్కుకున్న తమకు సహాయం అందించాలని కోరుతూ వీడియో సందేశం విడుదల చేశారు. ‘3 నెలల షూటింగ్ నిమిత్తం కోవూరు వచ్చాం. కోవూరు బ్రిడ్జి సమీపంలోని ఓ భవనంలో నాతో పాటు 30 మంది వరకు ఉన్నాం. మేం ఉన్న ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది. కనీసం తాగునీరు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు. దయచేసి సహాయం చేయండి ’ అని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరద ప్రవాహాలు తీవ్ర విషాదం నింపుతున్నాయి. కడప నగరంలోని రమేష్ థియేటర్ సమీపంలో రాధాకృష్ణ నగర్లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది(Building collapse Kadapa). ఈ ఘటనలో ఎవరికి ఏలాంటి ప్రాణాపాయం కలగలేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష మేర ఆస్తి నష్టం వాటిల్లింది. పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి.
ఏపీలో వరద బీభత్సం
ఏపీలోని కడప జిల్లాలో వరద పోటు(Andhra Pradesh floods 2021) 12 మందిని బలిగొంది. రాజంపేట మండలం నందలూరు వెళుతున్న మూడు ఆర్టీసీ బస్సులు... వరదనీటిలో చిక్కుకు పోయాయి. నందలూరు సమీపంలో ఉదయం నుంచి వరదలోనే ఉన్న ఆర్టీసీ బస్సుల్లోని సిబ్బంది, కొందరు ప్రయాణికులు.... ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. నందలూరు పరివాహన ప్రాంతాల్లోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లో 3 ఆర్టీసీ బస్సులు వరద ఉద్ధృతిలో చిక్కుకుని కొట్టుకుని పోయిన ఘటనలో 30 మంది గల్లంతయ్యారు. వారిలో ఇప్పటి వరకు 12 మంది మృత దేహాలు లభ్యమయయ్యాయి. ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన సహాయక సిబ్బంది, అధికారులు మృతదేహాలను వెలికి తీశారు. గండ్లూరులో 7, రాయవరంలో 3, మండపల్లిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరిని ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన కండట్కర్ అహోబిలం, చిట్వేలికి చెందిన శ్రీనుగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సుల్లోని కొందరిని మాత్రం అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: Tirumala news today : తిరుమల కనుమ రహదారులు పునరుద్దరణ