Christmas celebrations in telangana: రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రిస్మస్ ఉత్సవాల కమిటీతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి భేటీ అయ్యారు. పంపిణీకి ప్రభుత్వం సిద్ధం చేసిన దుస్తులను మంత్రులు విడుదల చేశారు.
క్రిస్మస్ వేడుకలకు సీఎం..
clothes distribution for Christmas: సుమారు 2.5 లక్షల మంది పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ నెల 17 వరకు రాష్ట్రంలోని 95 అసెంబ్లీ స్థానాల్లో దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 21 లేదా 22న ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేడుకలు నిర్వహిస్తామన్న మంత్రి.. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. నగరంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణ కోసం.. జీహెచ్ఎంసీ పరిధి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈనెల 15న భేటీ అనుకున్నట్టు కొప్పుల తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విరోధులుగా కన్పిస్తారంతే..
"దుష్ప్రచారం చేయడంలో విపక్షాలు మేమంటే మేమని పోటీపడుతున్నాయి. కేంద్రంలో భాజపా, కాంగ్రెస్ విరోధులుగా ఉన్నట్లుగా కనిపిస్తారు. రాష్ట్రంలో మాత్రం ఇరుపార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. తెరాస పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉంది. రాష్ట్ర అభివృద్ధిని పార్లమెంటులో కేంద్రం కీర్తిస్తుంది. రాష్ట్ర భాజపా నేతలు మాత్రం ఇక్కడ అభివృద్ధి లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని బట్టే అర్థమవుతోంది.. భాజపా నేతలు ఎంత తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో. రాష్ట్ర అభివృద్ధి కోసం తెరాస ఎల్లవేళలా కృషిచేస్తుంది. రానున్న క్రిస్మస్ వేడుకలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టాం. ఈ నెల 21 లేదా 22 న ఎల్బీస్టేడియంలో ప్రధాన వేడుకలు నిర్వహిస్తాం. వీటికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు." - కొప్పుల ఈశ్వర్, మంత్రి
ఇదీ చూడండి: