ETV Bharat / city

స్టేషన్ బెయిల్​పై చింతమనేని ప్రభాకర్ విడుదల

author img

By

Published : Feb 19, 2021, 6:48 AM IST

ఏపీలోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు వ్యవహారం.. మరోసారి దుమారం రేపింది. ఓ అభ్యర్థిని బెదిరించారంటూ చింతమనేనని ఎన్నికల ప్రచారం మధ్యలో నుంచి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌పై నమోదు చేసిన సెక్షన్లకు ఆధారాల్లేవన్న న్యాయమూర్తి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపాలని ఆదేశించారు.

chinthamaneni-prabhakar-release-in-dhendhulur in ap
స్టేషన్ బెయిల్​పై చింతమనేని ప్రభాకర్ విడుదల

ఆంధ్రప్రదేశ్​లోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్ వ్యవహారం.. మరోసారి దుమారం రేపింది. ఓ అభ్యర్థిని బెదిరించారంటూ.. చింతమనేనని ఎన్నికల ప్రచారం మధ్యలో నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభాకర్‌పై నమోదు చేసిన సెక్షన్లకు ఆధారాల్లేవన్న న్యాయమూర్తి.. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపాలని ఆదేశించారు. పోలీసులు అక్రమ కేసును నిరసిస్తూ ఇంటికెళ్లేది లేదని ఠాణాలో భీష్మించిన చింతమనేనిని.. పోలీసులు బలవంతంగా ఆయన ఇంటి వద్ద దించి వెళ్లారు.

ఆ రోజు నుంచి..
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. వరుస కేసులు ఎదుర్కొంటున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను.. పోలీసులు మరో కేసులో ఆరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బి.సింగవరం సర్పంచ్‌ అభ్యర్థి సరస్వతి, ఆమె భర్త సాంబశివరావు ఈనెల 17న రాత్రి గ్రామంలో ప్రచారం చేస్తుండగా చింతమనేని ప్రభాకర్‌ అనుచరులతో కలిసి దాడి చేశారని పేదవేగి ఠాణాలో ఫిర్యాదు చేశారు. చింతమనేనిని ఏ1గా, ఆయన అనుచరుల్లో కొందరిని సహనిందింతులుగా పేర్కొంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం మదేపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో చింతమనేనిని పోలీసులు అరెస్ట్‌ చేసి.. ఏలూరు గ్రామీణ ఠాణాకు తీసుకెళ్లారు.

వైద్యపరీక్షలు..

చింతమనేనికి వైద్యపరీక్షలు నిర్వహించిన పోలీసులు.. పశ్చిమ గోదావరి జిల్లా సెషన్ జడ్జి ముందు హాజరుపరిచేందుకు ప్రయత్నించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు సరైన ఆధారాల్లేవన్న న్యాయమూర్తి.. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. ఫలితంగా పోలీసులు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

భీష్మించిన చింతమనేని..

తనపై అక్రమ కేసులు పెట్టారంటూ ఠాణా నుంచి వెళ్లేదిలేదని చింతమనేని భీష్మించారు. పోలీసులు ఆయన్ను బలవంతంగా ఇంటి వద్ద వదిలారు. బి.సింగవరంలో జరిగిన వివాదానికి తనుకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆదేశాలతో తనపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా అడ్డుకునేందుకు తనపై పోలీసు కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టి వేధించినా లొంగనని స్పష్టం చేశారు.

చింతమనేనిపై కేసు విడ్డూరం : తెదేపా నేతలు

తెదేపా నాయకుడు, దెందులూరు మాజీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్​పై దొంగతనం కేసు మోపడం విడ్డూరంగా ఉందని తెదేపా నేతలు పేర్కొన్నారు. ప.గో. జిల్లా ఏలూరు గ్రామీణ ఠాణాలో చింతమనేని ప్రభాకర్​ను తెదేపా ఏలూరు పార్లమెంట్ బాధ్యులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు తెదేపా అసెంబ్లీ బాధ్యులు బడేటి రాధాకృష్ణ పరామర్శించారు. పెదవేగి మండలం బి. సింగవరంలో ప్రచారంలో పాల్గొన్న చింతమనేనిపై బెదిరింపులు, దోపిడీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం అక్రమమని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చింతమనేనిని అరెస్టు చేశారని తప్పుబట్టారు. ఏ సెక్షన్ లేకపోవడం వల్ల దోపిడి కేసు పెట్టి.. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఠాణాలో ఉంచారని వివరించారు.

ఇదీ చదవండి: వాతావరణశాఖ ప్రత్యేక యాప్‌.. ఆ వివరాలు మీరూ పంపొచ్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.