కలియుగ ధర్మాన్ని పాటించకపోవడంతోనే మానవ జాతి కష్టాల పాలవుతోందని..హైదరాబాద్లో హరేకృష్ణ మూమెంట్ ప్రచారకుడు చిన్మయ కృష్ణదాస అన్నారు. కరోనా, అతివృష్టి, అనావృష్టి వంటి విపత్తులతో మానవాళి ఇబ్బందులెన్నో పడుతోందని తెలిపారు. మానసిక ప్రశాంతత కోల్పోయి ఒత్తిడిలో కూరుకుపోయారని పేర్కొన్నారు.
హరేకృష్ణ జపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎలాంటి సమస్యలనైనా అధిగమించవచ్చు. 108కోట్ల సార్లు జపం చేయాలనే సంకల్పంతో.. అందరికి అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాం - చిన్మయ కృష్ణదాస
ఇదీ చూడండి: వరాహావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య