ETV Bharat / city

వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర: చంద్రబాబు

మాజీ మంత్రి వివేకానంద హత్యకేసు గురించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. హత్యకేసు నిందితుల హత్యకు.. జైలర్ వరుణ్ రెడ్డి ద్వారా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్​గా ఉన్న వరుణ్ రెడ్డినే.. ఇప్పుడు కడప జైలర్​గా నియమించటంపై అనుమానం వ్యక్తం చేశారు

వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర: చంద్రబాబు
వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర: చంద్రబాబు
author img

By

Published : Feb 12, 2022, 4:16 PM IST

CBN On Viveka Murder Case: ఏపీలోని కడప జైలులో ఉన్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుల హత్యకు.. జైలర్ వరుణ్ రెడ్డి ద్వారా కుట్ర జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్​గా ఉన్న వరుణ్ రెడ్డినే.. ఇప్పుడు కడప జైలర్​గా నియమించటంపై అనుమానం వ్యక్తం చేశారు. దీనివెనుక కుట్ర కోణం దాగుందన్నారు. ఈ విషయమై సీబీఐకి లేఖ రాయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

వివేకా హత్య కేసుతో సీఎం జగన్, ఎంపీ అవినాష్​ రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించిన చంద్రబాబు.. వరుణ్ రెడ్డి సాయంతో వారు నిందితుల హత్యకు కుట్ర పన్నుతున్నారన్నారు. మొద్దు శ్రీను హత్య తర్వాత చాలా కాలం సస్పెన్షన్​లో ఉన్న వరుణ్ రెడ్డిని ఇప్పుడు వివేకా హత్య కేసు నిందితులు ఉన్న కడప జైలుకు జైలర్​గా నియమించటం వెనుక కుట్ర దాగి ఉందన్నారు.

"వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోంది. మొద్దు శ్రీను హత్య సమయంలో అనంతపురం జైలర్‌గా వరుణ్‌రెడ్డి ఉన్నారు. వరుణ్ రెడ్డిని ఇప్పుడు కడప జైలర్‌గా నియమించారు. వివేకా హత్యకేసులో నిందితులు ప్రస్తుతం కడప జైలులో ఉన్నారు. కడప జైలర్‌గా వరుణ్‌ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తాం. కడప జైల్లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణహాని ఉంది. జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సాయంతో వరుణ్ రెడ్డి ద్వారా ప్రాణహాని ఉంది."

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.