దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ప్రజాజీవితంలో ఆయన సేవలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు.
ఎర్రన్నాయుడు ప్రజా బంధువు: చంద్రబాబు
ప్రజాబంధువు స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ధైర్యం, నిజాయతీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడని చంద్రబాబు కొనియాడారు. ఆయన ఆదర్శాలు, పోరాట స్ఫూర్తి.. బీసీలతో పాటు బడుగు, బలహీన వర్గాల వారందరికీ వరమయ్యాయని కీర్తించారు. పేదల పెన్నిధిగా, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, పార్లమెంట్లో ఆంధ్రుల గంభీర వాణిగా విరాజిల్లారని గుర్తు చేశారు.
ఎర్రన్న కంచు కంఠం: లోకేశ్
ఎర్రన్నాయుడు అన్న పేరు కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఎర్రన్న అంటే ప్రజా సమస్యలపై బెదురు లేకుండా స్పందించే కంచు కంఠమని అభివర్ణించారు.
ఇవీచూడండి: అమితాబ్‌కు మోహన్‌లాల్ ప్రత్యేక కానుక