మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించకపోవడం గర్హనీయమని మండిపడ్డారు. కమిటీ పేరుతో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పించడం శోచనీయమన్న చంద్రబాబు... అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆక్షేపించారు. అచ్చెన్నాయుడి అరెస్టులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని తెలిపారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా మార్పు రాలేదని మండిపడ్డారు.
అధికార దుర్వినియోగం: లోకేశ్
అచ్చెన్నాయుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. గాయం మానకముందే వైద్యులపై ఒత్తిడి చేసి డిశ్చార్జ్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఇప్పటికే @katchannaidu అరెస్ట్ లో ప్రభుత్వం అడుగడుగునా అమానవీయంగా వ్యవహరించి, ఆయనకు రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది. ఇంకా కక్షతీరలేదన్నట్టు, ఆయన్ను ఉన్నట్టుండి డిశ్చార్జ్ చేయించి డాక్టర్స్ డే రోజున మరో దుర్మార్గానికి పాల్పడింది ప్రభుత్వం(1/3)#WeStandWithAtchannaidu pic.twitter.com/4vCk1kzA5I
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఇప్పటికే @katchannaidu అరెస్ట్ లో ప్రభుత్వం అడుగడుగునా అమానవీయంగా వ్యవహరించి, ఆయనకు రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది. ఇంకా కక్షతీరలేదన్నట్టు, ఆయన్ను ఉన్నట్టుండి డిశ్చార్జ్ చేయించి డాక్టర్స్ డే రోజున మరో దుర్మార్గానికి పాల్పడింది ప్రభుత్వం(1/3)#WeStandWithAtchannaidu pic.twitter.com/4vCk1kzA5I
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 1, 2020ఇప్పటికే @katchannaidu అరెస్ట్ లో ప్రభుత్వం అడుగడుగునా అమానవీయంగా వ్యవహరించి, ఆయనకు రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది. ఇంకా కక్షతీరలేదన్నట్టు, ఆయన్ను ఉన్నట్టుండి డిశ్చార్జ్ చేయించి డాక్టర్స్ డే రోజున మరో దుర్మార్గానికి పాల్పడింది ప్రభుత్వం(1/3)#WeStandWithAtchannaidu pic.twitter.com/4vCk1kzA5I
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 1, 2020
ఇదీ చదవండి: గుంటూరు జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్