chandrababu fires on AP cm jagan: వివేకా హత్యలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. వివేకా హత్యను తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పతనమయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Viveka Murder case : వివేకా హత్యను జగన్ రాజకీయంగా వాడుకున్నారన్న చంద్రబాబు.. జగన్ ఇప్పుడు బయటకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సూత్రధారి ఎవరన్నది తేలిపోయిందని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వివేకా హత్యకేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడం అసాధ్యమన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేయకూడదని.. హత్యకు గల సూత్రధారులను బోనులో నిలబెట్టాలన్నారు.
russia ukraine news: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల బాధలు తనని కలిచివేస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పేరుతో వంటనూనె ధరలు పెంచేశారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇవి మరింత భారం కాకుండా ప్రభుత్వం దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : పాల ధరలు పెంపు- మంగళవారం నుంచే.. లీటరుపై ఎంతంటే..