ETV Bharat / city

భారతి సిమెంట్‌పై లేని నియంత్రణ.. సినిమాపై ఎందుకు..! : చంద్రబాబు - జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

Chandrababu and Lokesh fires on AP CM Jagan : భీమ్లా నాయక్‌ సినిమా విషయంలో.. ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై.. తెదేపా నేతలు ధ్వజమెత్తారు. భీమ్లానాయక్‌ సినిమా విషయంలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని.. తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Chandrababu fires on AP CM Jagan , tdp leaders on jagan
భారతి సిమెంట్‌పై లేని నియంత్రణ.. సినిమాపై ఎందుకు..! : చంద్రబాబు
author img

By

Published : Feb 25, 2022, 1:59 PM IST

Chandrababu and Lokesh fires on AP CM Jagan : భీమ్లానాయక్‌ సినిమా విషయంలో.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జగన్ తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది: చంద్రబాబు

భీమ్లానాయక్‌ సినిమా విషయంలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని వ్యవస్థలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. భారతి సిమెంట్‌పై లేని నియంత్రణ.. భీమ్లా నాయక్‌ సినిమాపై ఎందుకని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

  • వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ #BheemlaNayak సినిమా పై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్...తన మూర్ఖపు వైఖరి వీడాలి.(2/4)

    — N Chandrababu Naidu (@ncbn) February 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నారు: లోకేశ్

భీమ్లా నాయక్‌ సినిమా అన్ని కుట్రలు అధిగమించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆకాక్షించారు. జగన్.. ఏపీలోని పరిశ్రమలను నాశనం చేస్తున్నారని.. దీనికి సినీ పరిశ్రమ కూడా మినహాయింపు కాదన్నారు. సినిమాకు అద్భుత స్పందన వస్తోందని, తానూ చూడాలని ఆతృతగా ఉన్నానని.. లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. అన్ని కుట్రలను అధిగమించి.. సినిమా మంచి విజయం సాధించాలని లోకేశ్‌ ట్వీట్ చేశారు.

రెవెన్యూ సిబ్బందిని గేటుమెన్లుగా చేశారు: అయ్యన్నపాత్రుడు

అక్షరాలు నేర్పే ఉపాధ్యాయులను మద్యం షాపుల‌కు కాప‌లా పెట్టిన జగన్‌.. ఇప్పుడు మండ‌ల పాల‌న చూసే రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్లకి గేటుమేన్లను చేశారని.. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం ఇవ్వడంవల్లే ఇదంతా జరుగుతోందని ట్వీట్‌ చేశారు.

  • అ..ఆలు దిద్దించే అయ్య‌వార్ల‌ని బేందీ షాపుల‌కు కాప‌లా పెట్టిన ముఖ్య‌మంత్రి సారు
    మండ‌ల ప‌రిపాల‌న చూసే రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల‌కి గేటుమేన్లను చేశారు.
    ఒక్క చాన్స్‌తో తెచ్చుకుని ద‌రిద్రాన్ని నెత్తికెత్తుకున్న పాపానికి ఈ ఖ‌ర్మ ప‌ట్టింది..@ysjagan

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) February 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Bheemla Nayak Review: 'భీమ్లా నాయక్​' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.