ETV Bharat / city

'సీఎం అసమర్థత వల్లే ఏపీలో కరోనా విజృంభిస్తోంది'

ఏపీ సీఎం అసమర్ధత వల్ల కరోనా రోజురోజుకు పెరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థం అయ్యే విధంగా తీసుకువెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఏపీలోని నియోజకవర్గాల ఇంచార్జిలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

chandra-babu-fires-on-cm-jagan
'సీఎం అసమర్థత వల్లే ఏపీలో కరోనా విజృంభిస్తోంది'
author img

By

Published : Jul 21, 2020, 11:28 PM IST

ఏపీ రాజధానిగా అమరావతి తరలిపోకుండా ఏం చేయాలో అన్ని చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థం అయ్యే విధంగా తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల ఇంచార్జిలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సీఎం అసమర్ధత వల్ల కరోనా రోజురోజుకు పెరుగుతోందని దుయ్యబట్టారు. ఇంతవరకు సీఎం మాస్క్ ధరించకుండా.. అందరూ మాస్క్ ధరించకపోతే జరిమానాలు వేస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని చంద్రబాబు ప్రశ్నించారు.

కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కావాలని తొలగించారని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. పోలీస్ బలగాలతో వైకాపా నాయకులు దగ్గరుండి తొలగించారని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని నెల్లూరు జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు. జిల్లా నేతలందరూ మాట్లాడి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. 'ఛలో కావలి' కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చంద్రబాబుకు బీదా రవిచంద్ర యాదవ్ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.