ETV Bharat / city

Chandrababu Comments on Jagan : 'ఆ మరణాలన్నీ సర్కారు హత్యలే' - ఏపీలో వరదలపై చంద్రబాబు వ్యాఖ్యలు

వరద బాధితులను పరామర్శించడం కోసం ముంపు ప్రాంతాలకు వెళ్తే.. సహాయక కార్యక్రమాలకు ఆటంకమని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించడం చేతగానితనమేనని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన బాబు.. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్​ చేశారు.

CHANDRABABU NAIDU, చంద్రబాబు నాయుడు
CHANDRABABU NAIDU
author img

By

Published : Nov 29, 2021, 5:52 PM IST

వరదల కారణంగా చోటు చేసుకున్న మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ వ్యాఖ్యానించడం.. చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు.

పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు.. విపత్తు నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యాలపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్​ చేశారు. బాధితులకు ఇంత వరకు పరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు.. విపత్తు నిధులు రూ.1,100 కోట్లను దారిమళ్లించారని ఆరోపించారు.

వరి వేయవద్దంటూ రైతులను సాగుకు దూరం చేస్తున్నారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందన్నారు. ఓటీఎస్ పేరుతో రూ.14,261 కోట్ల వసూళ్లు విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు రూపాయి కట్టనక్కర్లేదన్న చంద్రబాబు.. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

'ప్రజాసమస్యలు చర్చించే సభను కౌరవ సభగా మార్చారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహిస్తాం. మహిళల పట్ల వైకాపా వైఖరి, ప్రజా సమస్యలపై చర్చిస్తాం. చట్ట వ్యతిరేకంగా నిధుల బదిలీ ప్రక్రియ విరమించుకోవాలి. డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన రూ.2,200 కోట్లు స్వాహా చేశారు.'

- చంద్రబాబు, తెదేపా అధినేత

ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి తెదేపా సంఘీభావం తెలుపుతుందని చంద్రబాబు అన్నారు. తెదేపా కార్యాలయంపై దాడి ఘటనపై కేసునమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనపై ప్రజాక్షేత్రంతోపాటు కోర్టులోనూ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి: Telangana Cabinet Meeting: కొనసాగుతున్న కేబినెట్​.. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, కొవిడ్​పై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.