ETV Bharat / city

'అంధకారంలో ఉన్న ఏపీకి వెలుగు చూపాల్సింది యువతే'

తెదేపా అధినేత చంద్రబాబు... యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని సూచించారు. వివేకానందుడు చూపిన బాటలో నడవాలని సూచించారు.

chadrababu-national-youth-festival-wishes
యువతకు చంద్రబాబు యువజన దినోత్సవ శుభాకాంక్షలు
author img

By

Published : Jan 12, 2021, 1:32 PM IST

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద కలలుగన్న సమాజం ఆవిష్కరణే లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. వివేకానందుడు చూపిన బాటలో యువతరం నడవాలని సూచించారు. 19 నెలలుగా ఏపీ రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అప్పుల ఊబిలో ముంచారని ఆరోపించారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారనీ.. యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

  • ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉన్నట్టుగా ప్రతి జాతికీ, దేశానికీ వ్యక్తిత్వం ఉందని దాన్ని ఆ జాతి ప్రజలు కాపాడుకోవాలని అన్నారు స్వామి వివేకానంద. ఆ సూక్తి స్ఫూర్తిగానే తెలుగు జాతి వ్యక్తిత్వాన్ని చాటేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్.(1/2) pic.twitter.com/9bDelq9tvl

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) January 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వేలమంది యువతీయువకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీ రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని.. పాలకుల దుశ్చర్యలపై అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.