ETV Bharat / city

సాగర్​ ఉపఎన్నిక పోలింగ్​ సాఫీగా సాగింది: సీఈవో - సాగర్​ ఉపఎన్నిక

సాగర్​ ఉపఎన్నిర పోలింగ్​ సాఫీగా సాగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్​ గోయల్​ వెల్లడించారు. తగిన చర్యలు తీసుకున్నందు వల్లే భారీ ఓటింగ్​ నమోదైందని ఆయన పేర్కొన్నారు.

ceo shashank goyal
సాగర్​ ఉపఎన్నిక పోలింగ్​ సాఫీగా సాగింది: సీఈవో
author img

By

Published : Apr 17, 2021, 10:21 PM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ సాఫీగా సాగిందని... సాయంత్రం ఏడు గంటల వరకు దాదాపు 88శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలను బాగా పాటించారన్న ఆయన... తగిన చర్యలు తీసుకున్నందు వల్లే ఓటర్లు ధైర్యంగా వచ్చి ఉత్సాహంతో ఓటు వేశారని అన్నారు. 36 మంది కొవిడ్​ పాజిటివ్ రోగులు ఓటుహక్కును వినియోగించుకున్నారని సీఈవో తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరిగిందని చెప్పారు. ఓటర్ల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. రాజకీయ పార్టీల సమక్షంలో నల్గొండలో ఈవీఎంలను భద్రపరుస్తారన్న సీఈవో... అభ్యర్థులు, వారి ఏజెంట్లు స్ట్రాంగ్ రూంను సందర్శించవచ్చని తెలిపారు. స్ట్రాంగ్ రూం వద్ద 24 గంటల పాటు పటిష్ట బందోబస్తు ఉంటుందని చెప్పారు.

సాగర్​ ఉపఎన్నిక పోలింగ్​ సాఫీగా సాగింది: సీఈవో

ఇదీ చదవండి: నాగార్జునసాగర్​లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.