ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - central minister Piyush Goyal visit tirumala temple in ap latest news

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దంపతులు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. కరోనా సమయంలో భారత్‌ .. 150 దేశాలకు ఔషధాలు సరఫరా చేసిందని చెప్పారు. ప్రస్తుతం 75 దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తోందని తెలిపారు.

central-minister-piyush-goyal-visit-tirumala-temple-in-ap
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
author img

By

Published : Mar 13, 2021, 12:28 PM IST

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కరోనా కారణంగా గతేడాది స్వామివారిని దర్శించుకోలేకపోయానని గోయల్ తెలిపారు.

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

కరోనా సమయంలో యావత్ ప్రపంచానికి.. భారత్‌ తన శక్తిని చాటి చెప్పిందన్న పీయూష్‌ గోయల్‌.. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 150 దేశాలకు ఔషధాలు సరఫరా చేశామని తెలిపారు. ప్రస్తుతం 75 దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ను అందిస్తున్నామని చెప్పారు.

తిరుపతి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్న పీయూష్‌.. మరింతమంది భక్తులు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. తిరుమల శ్రీవారి వారి దర్శనానంతరం.. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

గోయల్ దంపతులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందించారు. కేంద్రమంత్రితో పాటు అమ్మవారి సేవలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.