ETV Bharat / city

ఐదేళ్లలో తెరాస ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు: కిషన్ రెడ్డి - మల్కాజిగిరిలో కిషన్ రెడ్డి రోడ్​ షో

గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అలాంటి పార్టీకి మరోసారి ఓటేయవద్దని ప్రజలను కోరారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

central minister kishan reddy road show in malkajigiri circle
ఐదేళ్లలో తెరాస ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు: కిషన్ రెడ్డి
author img

By

Published : Nov 24, 2020, 2:40 PM IST

ఐదేళ్ల క్రితం ప్రజలు తెరాసను నమ్మి గెలిపిస్తే... ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పరిధిలోని పలు డివిజన్​లలో రోడ్ షో నిర్వహించారు. రెండు పడకల గదుల ఇళ్లు హామీ ఇంతవరకు నెరవేరలేదని, కనీసం రోడ్లు కూడా వేయలేదన్నారు.

ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఏ ఒక్క హామీని నెరవేర్చని తెరాసకు మరోసారి ఓటేయవద్దని సూచించారు. వరద బాధితులు కష్టాల్లో ఉన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రజల్లాగే జీహెచ్​ఎంసీలో తెరాసకు బుద్ది చెప్పాలని పేర్కొన్నారు. భాజపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో 'స్థానిక' పోరు- కార్యక్షేత్రంలోకి కాషాయదళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.