కశ్మీర్ హిందుస్థాన్కా... నహీ కిసీకీ బాప్‌కా అని తనకు నేర్పిన భాజపా హయాంలో కశ్మీర్ కోటపై కాషాయ జెండా ఎగురవేయడం ఎంతో గర్వంగా ఉందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన తెలుగు వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
భాజపాలో చేరాక తాను మొదట నేర్చుకున్న నినాదం భారత్ మాతాకీ జై అని, రెండో నినాదం భారతీయ జనతా పార్టీకి జై అని తెలిపారు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో మగ్గుతున్న తెలుగు వారికి భారత పౌరసత్వం ఇవ్వాలనుకున్న మోదీ సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతాం చేస్తున్నాయని మండిపడ్డారు.
దిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరాలంటే, రాజధాని వాసులు కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
- ఇదీ చదవండి: ఆస్కార్‌కు నామినేట్ అవ్వటం సంతోషమే.. కానీ!