ETV Bharat / city

Coal Crisis: 'అక్కడ బొగ్గు నిల్వలెందుకు..? ఇతర రాష్ట్రాలకు తరలించండి' - తెలంగాణ వార్తలు

బొగ్గు కొరత(coal shortage in india)తో పాటు పలు రాష్ట్రాల్లో కరెంటు డిమాండు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం చూపు బొగ్గు గనులున్న ప్రాంతాల్లోని విద్యుత్కేంద్రాల(power plants)పై పడింది. 13 రోజులకు సరిపడ విద్యుత్ నిల్వలున్న కేంద్రాలు దేశం మొత్తం మీద నాలుగే ఉన్నాయి. వాటిల్లో మన రాష్ట్రంలోని భూపాలపల్లి విద్యుత్కేంద్రం(Kakatiya Thermal Power Station) ఒకటి. భూపాలపల్లి విద్యుత్​ కేంద్రంలో 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలున్నందున.. తీవ్ర కొరత ఉన్న రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బొగ్గును పంపాలని కేంద్రం ఆదేశించింది.

(Kakatiya Thermal Power Station
(Kakatiya Thermal Power Station
author img

By

Published : Oct 13, 2021, 7:53 AM IST

బొగ్గు కొరత((coal shortage in india)తో పాటు పలు రాష్ట్రాల్లో కరెంటు డిమాండు పెరుగుతుండటంతో కేంద్ర విద్యుత్‌(electricity), బొగ్గు శాఖ(ministry of coal and mines)లు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ, బిహార్‌, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో బొగ్గు గనులున్న(coal mines) ప్రాంతాల్లోని విద్యుత్కేంద్రాల((power plants)ను రోజువారీ విచారణ చేస్తున్నాయి. దేశంలోని మొత్తం 116 విద్యుత్కేంద్రాల(power plants)కు రోజూ ఎంత బొగ్గు సరఫరా చేస్తున్నారు, ఎంత నిల్వలున్నాయో కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. మొత్తం విద్యుత్కేంద్రాల్లో 4 చోట్ల మాత్రమే 13 రోజులపాటు కరెంటు ఉత్పత్తి అవసరానికి మించి బొగ్గు నిల్వలున్నట్లు తేలింది. అందులో భూపాలపల్లి విద్యుత్కేంద్రం(Kakatiya Thermal Power Station) ఒకటి. ఇక్కడ 15 రోజులపాటు విద్యుదుత్పత్తికి సరిపడా నిల్వలున్నాయి. ఈక్రమంలో కేంద్రప్రభుత్వం దానిపై దృష్టి పెట్టింది. అక్కడ అధిక నిల్వలున్నప్పటికీ రోజూ అక్కడికి ఎందుకు బొగ్గు పంపుతున్నారని సింగరేణిని ప్రశ్నించింది. కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర విద్యుత్కేంద్రాల్లో తీవ్ర కొరత ఉన్నందున అక్కడికి సరఫరా చేయాలని ఆదేశించింది.

సొంత గని ఉన్నా...

భూపాలపల్లి కేంద్రంలో(Kakatiya Thermal Power Station) విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు కోసం జయశంకర్‌ జిల్లా తాడిచెర్ల ప్రాంతంలో గనిని కేంద్రం నుంచి ప్రత్యేకంగా తీసుకుంది. ఇలా విద్యుత్కేంద్రాని(power plants)కి సొంతంగా గని ఉంటే దానిని క్యాప్టివ్‌ ప్లాంటు అని పిలుస్తారు. అక్కడ తవ్విన బొగ్గును భూపాలపల్లిలో విద్యుదుత్పత్తి(Kakatiya Thermal Power Station)కే వినియోగించాలని కేంద్రం షరతు విధించింది. తాడిచర్ల గనిలో కూడా జెన్‌కో(genco) తరఫున సింగరేణి)singareni coal mines) సంస్థే బొగ్గు తవ్వి భూపాలపల్లికి పంపుతోంది. అక్కడ రోజూ 5 వేల టన్నులే వస్తున్నందున అదనంగా మరో 8 వేల టన్నులు ఇతర గనుల నుంచి ఇస్తోంది. ఇవన్నీ కలసి అక్కడి నిల్వలు 15 రోజులకు సరిపోనున్నాయి. కానీ ఇతర రాష్ట్రాల్లో కొరత ఉన్నందున బొగ్గు అక్కడికి పంపాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం రాతపూర్వక ఆదేశాలివ్వలేదని, మౌఖికంగా చెప్పినట్లు అధికార వర్గాలు చెప్పాయి.

సింగరేణిపైనా కన్ను

బొగ్గు గనులతో పాటు సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌లో విద్యుత్కేంద్రం(Singareni Thermal Power Project) నిర్మించుకున్న సింగరేణిపైనా కేంద్రప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. నిబంధనల ప్రకారం అక్కడ 15 రోజులకు సరిపడా 2.27 లక్షల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. కానీ ప్రస్తుతం 90 వేల టన్నులే ఉంది. ఇక్కడ రోజూ 15,300 టన్నుల బొగ్గును మండిస్తారు. ఈలెక్కన ఆరు రోజులకు సరిపడా ఉన్నందున అదనంగా సరఫరా చేయవద్దని, అంతే మొత్తంలో నిల్వలుంచాలని కేంద్రం సూచించింది.

  • కొత్తగూడెం, మణుగూరులో 4 రోజులకు, రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లలో 3 రోజులకు విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ 3 కేంద్రాలకు రోజూ 68 వేల టన్నుల బొగ్గును సింగరేణి పంపాలి. కానీ అంతమేర పంపనందున తక్కువ నిల్వలున్నాయి.

సంబంధిత కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.