ETV Bharat / city

కేంద్రం ప్యాకేజీలో అన్ని దీర్ఘకాలిక సాయాలే.. - కేంద్రం ప్యాకేజీలో అన్ని దీర్ఘకాలిక సాయాలే

గత ఖరీఫ్‌లో తెలంగాణలో రూ.27వేల కోట్ల పంటరుణాలు ఇవ్వాలని బ్యాంకులకు లక్ష్యం పెడితే రూ.18వేల కోట్లు ఇచ్చాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రూ.33 వేల కోట్ల రుణ లక్ష్యానికి గాను ఇప్పటికీ 20 శాతం మందికి రుణాలు అందడం లేదు. పైగా గతంలో వ్యవసాయంపై కేంద్ర బడ్జెట్‌లో చెప్పిన అంశాలనే ఇప్పుడు కేంద్రం ప్యాకేజీలో ఎక్కువగా వివరించారు. రైతులకు విపత్తు సాయంగా తక్షణం ఏమీ ఇవ్వలేదు.

not allocate funds to farmers
కేంద్రం ప్యాకేజీలో అన్ని దీర్ఘకాలిక సాయాలే..
author img

By

Published : May 17, 2020, 2:42 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి, రైతులకు తక్షణం అందే సాయం ఏమీ ఉండదని, దీర్ఘకాలంలో రాయితీలు, ప్రోత్సాహకాలు దక్కుతాయని అంచనా. కూలీలకు, రైతులకు సత్వర ఉపశమనంగా ప్యాకేజీలో ఏమీ లేవు. శీతలగిడ్డంగుల నిర్మాణం, ఆన్‌లైన్‌లో పంటల కొనుగోలు సదుపాయాలు పెంచడం వంటివి మార్కెటింగ్‌ వ్యవస్థ పటిష్ఠతకు ఉపయోగపడతాయని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ చెబుతోంది. మత్స్యకారులకిచ్చే రుణాలను వ్యవసాయ రుణాల జాబితాలో చేర్చడం వల్ల వారికవి పావలా వడ్డీకే లభించే అవకాశముంది.

  • ఈ-ట్రేడ్‌ విధానంతో పంటలను ఆన్‌లైన్‌లో అమ్ముకునే సదుపాయాలు కల్పించి, కమీషన్‌ ఏజెంట్లు లేకుండా చేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది.
  • తెలుగు రాష్ట్రాల్లో పండే పసుపు, మిరప పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండు ఉన్నందున వాటికి ప్రత్యేకంగా బ్రాండ్‌ పెట్టి అమ్మితే ఇక్కడి పంటకు ధర, రైతులకు ఆదాయం పెరుగుతుందని ఉద్యానశాఖ భావిస్తోంది.
  • తెలంగాణ పసుపు పంటకు మద్దతుధర ప్రకటించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు ఉద్యానసంచాలకుడు వెంకట్రాంరెడ్డి చెప్పారు.
  • నాబార్డు ద్వారా సన్న, చిన్నకారు రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలివ్వడానికి రూ.30వేల కోట్లతో అత్యవసర నిధి ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కానీ రైతులకు పంటరుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని తెలంగాణ రాష్ట్ర రుణ విమోచన కమిషన్‌(ఆర్‌వీసీ) స్పష్టం చేసింది.

ప్రస్తుత విపత్తు నేపథ్యంలో ‘జాతీయ ఆహార భద్రత’ కింద ప్రతీ రైతుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకూ పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణమిస్తే వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడతాయని కమిషన్‌ కేంద్రానికి విన్నవించింది. రిజర్వుబ్యాంకు నిబంధనలకు వక్రభాష్యం చెపుతూ ఒక రైతుకు ఎన్ని ఎకరాలున్నా గరిష్ఠంగా రూ.1.60లక్షలే ఇస్తున్నాయని, రుణ పంపిణీ సరిగా లేదంటూ ఆర్‌వీసీ సభ్యుడు పాకాల శ్రీహరిరావు కేంద్ర ఆర్థిక మంత్రికి శుక్రవారం లేఖ రాశారు.

బడ్జెట్‌ అంశాలనే మళ్లీ చెప్పారు..

గతంలో వ్యవసాయంపై కేంద్ర బడ్జెట్‌లో చెప్పిన అంశాలనే ఇప్పుడు కేంద్రం ప్యాకేజీలో ఎక్కువగా వివరించారు. నిత్యావసరాల చట్టాన్ని సరళీకరించడం వల్ల వ్యాపారులకే లాభం. రైతులకు విపత్తు సాయంగా తక్షణం ఏమీ ఇవ్వకపోవడం ప్యాకేజీలో లోపం. కాంట్రాక్టు వ్యవసాయం అమల్లోకి తెస్తే ప్రభుత్వం రైతులకు రక్షణ వ్యవస్థగా ఉండాలి. రైతు సహకార సంఘాలకు, స్టార్టప్‌లకు సాయం చేస్తామన్నారు. కానీ, అవి నేరుగా రైతులకు చేరతాయా, అంకురాల పేరుతో ఇతరులకు అందుతాయా అన్నది వేచి చూడాల్సిన అంశం. -జీవీ రామాంజనేయులు, వ్యవసాయ రంగ నిపుణులు

ఇవీ చూడండి: ప్యాకేజ్ 5.0: సంక్షేమమే లక్ష్యంగా సంస్కరణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.