-
For Telangana -
— Nitin Gadkari (@nitin_gadkari) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Ministry of Road Transport and Highways has sanctioned 195.6 km of National Highways at a cost of 1005.38 Cr In the state of Telangana for 2020-21.#PragatiKaHighway
">For Telangana -
— Nitin Gadkari (@nitin_gadkari) April 6, 2021
Ministry of Road Transport and Highways has sanctioned 195.6 km of National Highways at a cost of 1005.38 Cr In the state of Telangana for 2020-21.#PragatiKaHighwayFor Telangana -
— Nitin Gadkari (@nitin_gadkari) April 6, 2021
Ministry of Road Transport and Highways has sanctioned 195.6 km of National Highways at a cost of 1005.38 Cr In the state of Telangana for 2020-21.#PragatiKaHighway
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసింది. 2020-21 ఏడాదికి గాను సుమారు 196 కిలోమీటర్ల మేర... జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1005.38 కోట్లు మంజూరు చేశామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. నిజాంపేట్-బీదర్ జాతీయ మార్గంలో భూసేకరణ, పునరావాసానికి 27.79 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్హెచ్-564లో భాగమైన నకిరేకల్-నాగార్జున సాగర్ మార్గంలో.. పనులకు అనుమతి ఇచ్చామని వివరించారు. హైదరాబాద్-బెంగళూరు ఎన్హెచ్-44 మార్గంలో రోడ్డు భద్రత పెంపు కోసం అండర్పాస్, సర్వీస్ రోడ్లకు 21.16 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
హైదరాబాద్-భూపాలపట్నం మార్గంలో ఆరు లైన్ల రహదారి విస్తరణకై 48.32 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎల్బీ నగర్-మల్కాపూర్ ఆరు లైన్ల క్యారేజ్ వే పునరుద్ధరణ, విస్తరణ, సర్వీస్ రోడ్లు సహా భద్రత చర్యల కోసం 545.11 కోట్లు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఎన్హెచ్-163 రహదారి 4 లైన్ల విస్తరణ, అభివృద్ధికై 317 కోట్లు మంజూరు చేశామని.. జడ్చర్ల-కల్వకుర్తి మార్గంలో 4 లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి 45 కోట్లు అందించామని నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఇదీ చదవండి: 'న్యాయంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేది అప్పుడే'