ETV Bharat / city

విన్నపాలు బుట్టదాఖలు.. రాష్ట్రాన్ని నిరుత్సాహపరిచిన కేంద్ర బడ్జెట్​ - telangana news

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అదనంగా ఏమీ దక్కలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా సహా.. వివిధ విన్నపాలకు ఎక్కడా చోటు కల్పించలేదు. పన్నుల్లో రాష్ట్ర వాటాలోనూ తగ్గుదల ఉంది. రుణపరిమితి 4 శాతానికి పెరిగింది. మిషన్ భగీరథ నిర్వహణకు మాత్రం.. రాష్ట్రానికి ప్రత్యేకంగా 2 వేల 350 కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.

budget news
విన్నపాలు బుట్టదాఖలు.. రాష్ట్రాన్ని నిరుత్సాహపరిచిన కేంద్ర బడ్జెట్​
author img

By

Published : Feb 2, 2021, 5:14 AM IST

విన్నపాలు బుట్టదాఖలు.. రాష్ట్రాన్ని నిరుత్సాహపరిచిన కేంద్ర బడ్జెట్​

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి మరోమారు నిరాశే ఎదురైందని చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి అదనంగా, ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేకపోవడమే ఇందుకు కారణం. బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. విభజన చట్టంలోని హామీలు సహా వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరింది.

విభజన హామీలు గాలికి..

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరింది. ఖాజీపేటలో రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి విభజన చట్టంలోని హామీలకు కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేసింది. వెనుక బడిన జిల్లాలకు 900 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇవ్వాలని కోరింది. మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ రాయితీని అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని.. సామాజిక భద్రతా ఫించన్లకు కేంద్రం ఇస్తున్న 200 రూపాయలను వెయ్యి రూపాయలకు పెంచాలని కోరింది. అటు హైదరాబాద్​లో వరదల కారణంగా ఐదు వేల కోట్ల నష్టం జరిగినందున.. తక్షణమే రూ.1,350 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు.

కానరాని విన్నపాలు..

మరోవైపు పారిశ్రామికంగా హైదరాబాద్ ఫార్మాసిటీ.. కాకతీయ టెక్స్​టైల్ పార్కు, పారిశ్రామిక కారిడార్లకు నిధులు కేటాయించాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది. హైదరాబాద్ నగరంలో సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్, వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం.. వరంగల్‌ మెట్రో ప్రాజెక్టు, పురపాలికల్లో ఘనవ్యర్థాలు, మానవ వ్యర్థాల నిర్వహణ.. బయోమైనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితరాలకు నిధులు ఇవ్వాలని కోరారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులూ చేయలేదు.

తగ్గిన పన్నుల వాటా..

రుణపరిమితిని జీఎస్డీపీలో 5 శాతానికి షరతుల్లేకుండా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం నాలుగు శాతానికి పెంచింది. తద్వారా అదనంగా ఒకశాతం అప్పు తీసుకునే వెసులుబాటు కలిగింది. అటు పన్నుల్లో రాష్ట్ర వాటా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలోనే వాటా తగ్గగా.. 2021-22కు కూడా తగ్గింది. రానున్న ఐదేళ్లకు 15వ ఆర్థిక సంఘం పన్నుల్లో రాష్ట్ర వాటా 2.102 శాతానికి తగ్గింది. దీంతో గత బడ్జెట్​లో పేర్కొన్న 16 వేల 726 కోట్ల రూపాయల పన్నుల్లో వాటా ఈసారి 13 వేల 990 కోట్లకు తగ్గింది. తద్వారా 2 వేల 736 కోట్ల రూపాయల మేర తగ్గుదల నమోదైంది.

సిఫార్సుల ప్రకారం..

ఐదేళ్లలో రాష్ట్రానికి ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం లక్షా 9 వేల 786 కోట్ల రూపాయలు రానున్నాయి. కేంద్ర పన్నుల్లో వాటాగా 88 వేల 806 కోట్లు, స్థానిక సంస్థలకు 13 వేల 111 కోట్ల రూపాయలు రానున్నాయి. ఆరోగ్య రంగానికి రూ.624 కోట్లు.. పీఎంజీఎస్​వై కింద రూ. 255 కోట్లు, గణాంకాలకు రూ.46 కోట్లు, న్యాయవ్యవస్థకు రూ. 245 కోట్లు.. ఉన్నత విద్యకు రూ.189 కోట్లు అందనున్నాయి. వ్యవసాయానికి రూ. 1,665 కోట్లు, విపత్తు నిర్వహణకు 2వేల 483 కోట్ల రూపాయలు వస్తాయి.

ఇక రాష్ట్రానికి ప్రత్యేకంగా 2 వేల 362 కోట్ల రూపాయలను ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఇందులో మిషన్ భగీరథ నిర్వహణ కోసం 2 వేల 350 కోట్లు ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసింది. జల్ జీవన్ అర్బన్, స్వచ్ఛభారత్ అర్బన్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులను.. భారీగా కేటాయించింది. ఆ కోటాలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలను నిధులు ఓ మోస్తరుగా రావచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవీచూడండి: బడ్జెట్: ఆత్మనిర్భర భారతానికి ఆశల పద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.