ETV Bharat / city

కరోనా వైరస్‌ జన్యు నిర్మాణంపై సీసీఎంబీ పరిశోధన

చైనాలో ప్రబలిన కరోనా వైరస్‌.. ప్రస్తుతం భారత్‌లో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ ఒక్కటేనా? ఇది తెలియాలంటే కరోనా ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ జన్యునిర్మాణం తెలియాలి. దీన్ని తెలుసుకొనేందుకు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనకు సిద్ధమవుతోంది.

ccmb research on covid-19
సీసీఎంబీ పరిశోధన
author img

By

Published : Mar 28, 2020, 10:51 AM IST

సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ప్రయోగానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ప్రయోగశాలలో అధునాతన హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ యంత్రం ఉంది. తక్కువ వ్యవధిలోనే జన్యు నిర్మాణాన్ని తెలుసుకునే సామర్థ్యం దీని సొంతం. ఈ పరిశోధనకు కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల నమూనాలు కనీసం అయిదు వందలైనా కావాలి. ఇప్పటికి భారత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 600 దాటింది.

జన్యునిర్మాణం చేపడతాం..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వైరాలజీ/ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వద్ద పాజిటివ్‌ వచ్చిన కేసుల నమూనాలు ఉన్నాయి. ఆ సంస్థల నుంచి తమకు నమూనాలు చేరితే జన్యునిర్మాణం చేపడతామని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. చైనాలోని పాజిటివ్‌ కేసుల నుంచి సేకరించిన నమూనాలతో చేపట్టిన జన్యు నిర్మాణం ఇప్పటికే అందుబాటులో ఉంది. మన వద్ద పరిశోధన పూర్తయ్యాక రెండింటిని పోల్చి విశ్లేషిస్తారు.

పరికరాల పనితీరునూ ధ్రువీకరిస్తారు..

నిర్ధరణ పరీక్షలు చేయాలంటే కిట్స్‌ తప్పనిసరి. ప్రస్తుతం చాలా సంస్థలు కిట్స్‌ను అభివృద్ధి చేసేందుకు ముందుకొస్తున్నాయి. వీటి పనితీరును పరిశీలించి ధ్రువీకరించే అధికారమూ సీసీఎంబీకి ఉంది. పరీక్షలను వేగవంతం చేయడంపైనా ఈ శాస్త్రవేత్తలు చర్చలు సాగిస్తున్నారు.

రెండు విడతల్లో శిక్షణ పూర్తి..

కరోనా కేసులు పెరుగుతుండటంతో నిర్ధరణ పరీక్షలు పెంచాల్సి ఉంది. మొదట్లో గాంధీ ఆసుపత్రిలో మాత్రమే నిర్వహించేవారు. తర్వాత ఐదు ఆసుపత్రులకు దీన్ని విస్తరించారు. వైరస్‌ కొత్తది కావడంతో పరీక్షలు నిర్వహణ కూడా కీలకం. కొత్తగా పరీక్షలకు అనుమతించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి రెండు విడతల్లో సీసీఎంబీలో శిక్షణ ఇచ్చారు.

ఇవీ చూడండి: వలస కూలీల ఆకలి తీర్చిన 'ఈటీవీ భారత్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.