ETV Bharat / city

వైరస్​పై సీసీఎంబీ బహుముఖ యుద్ధం - వైరస్​ కల్చర్

సెంటర్​ ఫర్​ సెల్యూలర్​ అండ్​ మాలిక్యులర్​ బయాలజీ కరోనా వైరస్​పై బహుముఖ యుద్ధం ప్రకటించి దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తోంది. కోవిడ్ పరీక్షలు నిర్వహించడం, అందులో మానవవనరులకు శిక్షణ ఇవ్వడం, వైరస్​ జన్యుపరిమాణక్రమాన్ని కనిపెట్టడానికి కసరత్తుతో పాటు వైరస్​ కల్చర్​పైనా పరిశోధనలకు శ్రీకారం చుట్టింది.

ccmb
వైరస్​పై సీసీఎంబీ బహుముఖ యుద్ధం
author img

By

Published : Apr 13, 2020, 10:13 AM IST

హైదరాబాద్​లోని సీసీఎంబీ కేంద్రం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన నమూనాలను పరీక్షిస్తోంది. రోజుకు 350 పరీక్షలు నిర్వహిస్తోంది. నిమ్స్, ఐపీఎం, హైదరాబాద్​ ఫీవర్​ ఆస్పత్రి, వరంగల్​ కాకతీయ మెడికల్​ కాలేజీలకు చెందిన 25 మంది వైద్యులు, టెక్నికల్ సిబ్బంది, విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వీరంతా తమ ఆస్పత్రుల్లోనే పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు.

జన్యు పరిణామక్రమంపై..

ఆర్​టీ-పీసీఆర్​లో రోగి నమూనాలను ఎలా పరీక్షించాలో చెబుతూ వీడియో పాఠాలను సీసీఎంబీ అందిస్తోంది. ఈ వైరస్​కు సంబంధించిన మొత్తం జన్యు పరిణామక్రమ పటాన్ని రూపొందించడానికి భవిష్యత్​ తరం పరిణామక్రమంపై విశ్లేషణ మొదలుపెట్టింది. ఇందు కోసం వైరస్​ ప్రభావం అత్యధికంగా ఉన్న రోగుల నమూనాలను సీసీఎంబీ సేకరించింది. ఇప్పటికే ఈ సంస్థ కొంతమంది రోగుల నుంచి సేకరించిన వైరస్​ను ఐసోలేట్​ చేసింది. వచ్చే మూడు నాలుగు వారాల్లో పరిణామక్రమాన్ని గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వైరస్​ కల్చర్​పైనా..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాలను కొత్త వైద్య అవసరాల కోసం పరీక్షించడానికి వైరస్​ కల్చర్​ అందుబాటులో లేకపోవడం పరిశోధకులకు ఇబ్బందిగా మారిన విషయాన్ని సీసీఎంబీ గుర్తించింది. అందుకే సీఎస్​ఐఆర్​- సీసీఎంబీ వైరస్​ కల్చర్​పై పరిశోధనలకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో వైరస్​లను వృద్ధిచేసి వాటి కల్చర్​ను పరీక్షిస్తారు. త్వరలో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

ఇవీచూడండి: కరోనా: రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు అంటే ఏమిటీ..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.