'టీకాలు వేయండి- ప్రాణాలు కాపాడండి' నినాదంతో ఈనెల 8న ఏపీవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి ఆయన.. ఏపీలోని కరోనా పరిస్థితులపై చర్చించారు. దేశంలో కొవిడ్ అధికంగా ఉన్న 33 జిల్లాల్లో 7 ఏపీలోనే ఉన్నాయని కేంద్రం ప్రకటించినా సీఎం జగన్ స్పందించరా? అని మండిపడ్డారు.
చంద్రన్న బీమా ఉంటే మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల బీమా వచ్చి ఉండేదన్నారు. వ్యాక్సిన్ తప్ప కరోనా నియంత్రణకు మరో మార్గం లేదన్న చంద్రబాబు... తాము సూచనలు చేస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందని వైకాపా నేతలే రాజమండ్రిలో మాట్లాడారన్నారు. కేవలం 13 లక్షల వ్యాక్సిన్ల కొనుగోలుకే ఆర్డర్ ఇచ్చారన్నారు.
ఇవీచూడండి: సొంత పార్టీ ఎంపీలే.. సీఎం జగన్పై దుమ్మెత్తిపోస్తున్నారు: నారా లోకేష్