జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లులు ఫీజు కట్టకుంటే.. తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పేర్కొంటూ కృష్ణదేవరాయ విద్యాసంస్థల తరఫున న్యాయవాది శ్రీ విజయ్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. విద్యా దీవెన మొత్తాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేసేలా ఏపీ ప్రభుత్వం.. జగనన్న విద్యా దీవెన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: Petrol attack: చిట్టి డబ్బులు అడిగినందుకు భార్యతో పెట్రోల్ పోయించి అంటించాడు..!