హైదరాబాద్ హస్తినాపురంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు ఆగి ఉన్న అంబులెన్స్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది యువకులు స్వల్పంగా గాయపడ్డారు. సీట్ బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.
మన్నెగూడాలో స్నేహితుని పుట్టిన రోజుకు హాజరైన తొమ్మిది మంది యువకులు.. అక్కణ్నుంచి సరూర్‌నగర్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలిని పరిశీలించిన ఎల్బీ నగర్ ఇంఛార్జి డీసీపీ యాదగిరి సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.