ఏపీలోని ప్రకాశం జిల్లాలోని మార్టూరు వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. తిరుమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు, హైవే సిబ్బంది ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :కంటైనర్ బోల్తా... డ్రైవర్‌కు తీవ్ర గాయాలు