ETV Bharat / city

Corona Effect : 'కారు'ణ్యమెరుగని దందా! - telangana news 2021

రుణాలు తీసుకొని కార్లు కొనుక్కున్నారు. వాటిని నడుపుకుంటూ జీవనం సాగించాలనుకున్నారు. అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి(Corona Effect) కారణంగా వారి జీవితాలు ఆగమయ్యాయి. తినేందుకు తిండి దొరకని పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న వారిని.. కిస్తీలు చెల్లించలేదంటూ రుణ సంస్థలు వాహనాలు లాక్కెల్తున్నాయి. ఏం చేయాలో పాలుపోక చావే శరణ్యమనుకొని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు డ్రైవర్లు.

cars, corona effect, cab drivers
కార్లు, కరోనా ఎఫెక్ట్, క్యాబ్ డ్రైవర్లు
author img

By

Published : Jun 27, 2021, 9:11 AM IST

హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ నిరుద్యోగి రుణం తీసుకుని కారు కొనుగోలు చేసి రెండేళ్లుగా ట్యాక్సీ నడుపుకొంటున్నారు. మరో నాలుగైదు వాయిదాలను మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఈలోగా కరోనా రెండో దశ రావడంతో మూడు నెలలుగా వాహనం ఇంటి వద్దే ఉండిపోయింది. తనకు నెల రోజుల సమయమిస్తే కిస్తీ బకాయిని చెల్లిస్తానని చెప్పినా కూడా రుణ సంస్థ ప్రతినిధి అర్ధరాత్రి ఇంటికొచ్చి వాహనం తీసుకెళ్లిపోయారు. దీంతో తాను ఎలా బతకాలంటూ 20 రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతున్నారు.

కరోనాతో పరిస్థితి ‘కారు’మారు

రాష్ట్రంలో దాదాపు 4.80 లక్షల ట్యాక్సీలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)తో పాటు కొన్ని బ్యాంకుల నుంచి కూడా నిరుద్యోగులు రుణాలు తీసుకుని కార్లు కొనుగోలు చేసి డ్రైవర్లగా మారి ట్యాక్సీలుగా తిప్పుకొంటున్నారు. కరోనా మొదటి రెండో దశలతో వీరి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది. చాలా మంది నెలవారీ కిస్తీలు సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో రుణాలిచ్చిన ప్రైవేటు సంస్థలు దౌర్జన్యం చేసి మరీ వాహనాలను తీసుకెళ్తున్నాయి. ఇప్పటికీ రోజూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారని ట్యాక్సీ డ్రైవర్లు చెబుతున్నారు.

తమ మనుగడ కూడా కష్టంగానే ఉందని, ఎక్కువ కాలం కిస్తీలు కట్టని వావానాలను స్వాధీనం చేసుకుంటున్న మాట వాస్తవమే అని కొన్ని రుణ సంస్థలు చెబుతున్నాయి.

వాహనాలు శుభ్రం చేయాలంటూ పిలిచి

అద్దెకు కార్లను తిప్పే ఓ సంస్థ దాదాపు ఎనిమిది వేల మందికి రుణ సంస్థల నుంచి సహాయం చేయించి కార్లను కొనుగోలు చేయించింది. కరోనా వల్ల వ్యాపారం దెబ్బతినడం, సంబంధిత కారు యజమానులు కిస్తీలు కట్టకపోవడంతో ఇటీవల యజమానులందరికీ ఓ సందేశం పంపింది. వైరస్‌ను నిరోధించడానికి వీలుగా కార్లను శుభ్రం చేయాలని, వాటిని తీసుకురావాలనేది ఆ సందేశం సారాంశం. దశల వారీగా ఎనిమిది వేల మంది కార్లను తీసుకురాగా..అన్నింటిని ఆ రుణ సంస్థ అధీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది. కరోనా సమయంలో కొన్ని ప్రైవేటు రుణ సంస్థలు అమానవీయంగా వ్యవహరిస్తున్నాయి. తమ దగ్గర రుణం తీసుకొని కార్లు కొనుగోలు చేసి ట్యాక్సీలుగా తిప్పుకొంటున్న వ్యక్తులు నెలవారీ కిస్తీ కట్టడం లేదంటూ బలవంతంగా వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు రుణ వసూళ్ల కోసం ఏకంగా నేర చరిత్ర ఉన్న కొందరిని వినియోగిస్తున్నాయి. గత ఏడాదిగా దాదాపు 35 వేలకుపైగా ట్యాక్సీలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ట్యాక్సీ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ చెబుతోంది. కొంతమంది యజమానులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేస్తోంది.

యజమానుల పరిస్థితి దారుణం..

- షేక్‌ సలావుద్దీన్‌, తెలంగాణ ట్యాక్సీ అండ్‌ డ్రైవర్స్‌ జేఏసీ ఛైర్మన్‌

రెండు మూడు నెలల పాటు కిస్తీ కట్టలేదని గత ఏడాదిగా రాష్ట్రంలో 35 వేలకు పైగా ట్యాక్సీలను రుణ సంస్థలు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాయి. కరోనా వల్ల ట్యాక్సీలను కొనుగోలు చేసిన యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయిదాలు చెల్లించడానికి మరింత గడువు కావాలని కోరినా కూడా రుణ సంస్థలు పట్టించుకోకుండా రౌడీలను ఇళ్లకు పంపుతున్నాయి. రుణాల చెల్లింపు కాలవ్యవధి పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

ఇదీ చూడండి: Revanth reddy: స్వతంత్ర జడ్పీటీసీ నుంచి టీపీసీసీ​ అధ్యక్షుడిగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.