ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల సమయ పాలనను కుదించింది. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి తెలిపారు. సిటీ బస్సులు రాత్రి 9 గంటలలోపు ఆయా డిపోలకు చేరుకుంటాయని వెల్లడించారు. అంతరజిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు మాత్రం 9లోపు వెళ్తాయని ఆయన స్పష్టం చేశారు.
రాత్రి 9 తర్వాత బయలుదేరాల్సిన బస్సుల సమయాన్ని 9లోపు వెళ్లేలా ఆయా డిపో మేనేజర్లు సమన్వయం చేసుకుంటారన్నారు. ప్రయాణికులందరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని ఆపరేషన్స్ ఈడీ యాదగిరి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ