Bus Ticket Fare Hike:"బస్సు ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం 20 పైసలు పెంచినా ఉపయోగం లేదు. కరోనా వల్ల సంస్థపై అదనపు భారం పడింది. నష్టాలు గట్టెక్కించాలి.. బస్సులు కొనుగోలు చేయాలి. దూర ప్రాంతాలకు బస్సులు పెంచే యోచన. ఛార్జీల పెంపుతో 7 వందల కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. పెంపు నిర్ణయంపై ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత లేదు. నష్టాల నుంచి బయటపడతామనే నమ్మకం లేదు. బీఓటీ పద్దతిలో ఆర్టీసీ ఖాళీ స్థలాలు లీజుకిచ్చే యోచన ఉంది. ఆర్టీసీకి దాదాపు 14 వందల ఎకరాల వరకు ఉంటుంది. స్థలాలు లీజుకు త్వరలోనే టెండర్లు పిలుస్తాం. స్థలాలు అమ్మడం లేదు.. డిపోలు ముూసేయడం లేదు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఆలోచనే లేదు. ముఖ్యమంత్రి నిర్ణయం తర్వాతే ఛార్జీల పెంచుతాం. త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎంను కోరతాం."
- బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఛైర్మన్
ఇవీ చూడండి: