ETV Bharat / city

పెరుగుతున్న ధరల భారం.. కష్టంగా సాగుతున్న జీవనం

author img

By

Published : May 3, 2022, 10:15 AM IST

commodities price hike : ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు.. మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఉప్పు, పప్పు, నూనె, పెట్రోల్‌.. ఇలా అన్నింటి ధరలు తగ్గేదే లే అన్న రీతిలో దూసుకెళ్తున్నాయి. మూడేళ్లలో నెలసరి ఇంటి ఖర్చులు ఏకంగా 5 వేలు దాటేశాయి. ఈ ధరాఘాతంతో బతకలేక సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

నానాటికీ పెరుగుతున్న ధరల భారం.. కష్టంగా సాగుతున్న రోజువారీ జీవనం

commodities price hike : ఉప్పు, పప్పు, వంట నూనె, కరెంటు బిల్లులు, పెట్రోల్ బాదుడు.. అబ్బో తలచుకుంటేనే మధ్య తరగతి ప్రజలు వణికిపోతున్నారు. మూడేళ్ల నాటితో పోలిస్తే.. ఇంటి ఖర్చు సగటున నెలకు రూ.5,200కు పైగా పెరిగింది. అద్దె జీవులైతే.. ఏటా 5 నుంచి 10 శాతం పెంపుతో అదనపు భారం తప్పదు. వంట నూనెల మంటలు అంతా ఇంతా కాదు. లీటరు రూ.60లోపు ఉండే పామోలిన్ ధర.. గతేదాడి రూ. 120కి చేరగా.. ఇప్పుడు ఏకంగా రూ.165 దాటేస్తోంది. పొద్దు తిరుగుడు నూనెదీ అదే దారి. ఏడాది కిందట పచారీ దుకాణానికి ఇచ్చే సొమ్ముతో పోలిస్తే.. రూ.1,000 నుంచి రూ.1,500ల వరకు పెరుగుదల కనిపిస్తోంది. కరోనా ప్రభావంతో పట్ణణాల్లో, పంటలు దెబ్బతిని గ్రామాల్లో ఉపాధి కరవైంది. అటు పనుల్లేక, ఇటు ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.

commodities price hike in AP : కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పుల ధరల్లో పెరుగుదల అధికంగా ఉంది. కరోనా సమయంలో ధరలు భారీగానే పెరిగినా తర్వాత కాస్త నెమ్మదించాయి. కొంతకాలంగా నిలకడగా సాగుతున్నాయి. ఈ ఏడాది కంది, సెనగల దిగుబడి తగ్గడంతో ఈ ప్రభావం ధరలపై పడొచ్చు. సగటున చూస్తే నెలకు కిలో చొప్పున కుటుంబంపై నెలకు రూ.65 చొప్పున భారం పెరిగింది. 5 కిలోల గోధుమపిండి ప్యాకెట్ ధర 2019లో రూ.205 ఉండగా.. ఇప్పుడు రూ.270 చొప్పున అమ్ముతున్నారు.

మరో పక్క ఫోన్‌ బిల్లు మనకు తెలియకుండానే పెరిగిపోతోంది. గతంలో 3 నెలలకు రూ.333 ఉండే రీఛార్జ్‌.. ఇప్పుడు రూ.666కు చేరింది. దీనికి తోడు వై-ఫై రూపంలో నెలకు రూ.500 వరకు అదనపు భారం తప్పట్లేదు. కేబుల్‌ టీవీ ఖర్చు రూ.250 వరకు అదనం. ఒక్కో ఓటీటీ ఛానెల్‌కు సగటున రూ.500 చొప్పున నాలుగు తీసుకున్నా.. రూ.2 వేలు. అంటే నెలకు రూ.166 చొప్పున ఖర్చవుతుంది. ఒక్కో కుటుంబంపైనా మొబైల్, కేబుల్ బిల్లుల రూపంలోనే నెలకు రూ.600 వరకు అవుతోంది. వై-ఫై, ఓటీటీ తీసుకున్న కుటుంబాలకు నెలకు రూ.1,000 చొప్పున తప్పట్లేదు.

2019 మధ్యలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.600 వరకు ఉంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.972 అయింది. అంటే మూడేళ్లలో 62 శాతం పెరిగింది. అప్పటితో పోలిస్తే రాయితీ కూడా తగ్గిపోయింది. రూ.15 చొప్పునే నామమాత్రంగా ఇస్తున్నారు. నెలకు ఒక సిలిండర్ లెక్కన చూస్తే.. ఒక్కో కుటుంబంపై రూ.372 చొప్పున భారం పడుతోంది. పేద, మధ్య తరగతిపై కరెంటు బిల్లుల భారమూ అధికమైంది. గతంలో సగటున రూ.500 చొప్పున బిల్లు వచ్చే కుటుంబానికి ఇప్పుడు రూ.650 వరకు చేరింది. అంటే సగటున 30 శాతం వరకు పెరిగాయి. వీటి రూపంలో ఒక్కో కుటుంబానికి రూ.150 చొప్పున అదనపు ఖర్చు తప్పడం లేదు. ఏడాదికి రూ.1,800 వరకు ప్రభుత్వం బాదేస్తోంది.

ఇక పెట్రోల్‌, డీజిల్ ధరల గురించైతే చెప్పనక్కర్లేదు. చిరు వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులకు ద్విచక్రవాహనం భారమైపోయింది. నెలకు సగటున 25 లీటర్ల పెట్రోల్‌ లెక్కన చూసినా రూ.1,100 వరకు ఖర్చు పెరిగింది. 2019లో రూ.75లోపు ఉన్న పెట్రోల్‌ ధర.. ప్రస్తుతం రూ.121 వరకు చేరింది. లీటరుకు రూ.45కు పైగానే పెరిగింది. ఇంజిన్‌ ఆయిల్ ధర రూ.300 నుంచి రూ.500కు చేరింది. సగటున రెండు నెలలకోసారి ఇంజిన్ ఆయిల్‌ మార్చినా.. నెల ఖర్చు రూ.100 చొప్పున పెరిగినట్లే. మొత్తంగా చూస్తే బండి భారం నెలకు రూ.1,200కు పైనే పెరిగింది. ఏడాది కిందట నుంచి మండుతున్న వంట నూనెలు.. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో మరింత ఎగిశాయి. పామోలిన్‌ను పెద్దమొత్తంలో సరఫరా చేసే ఇండోనేషియా ఎగుమతులపై నిషేధం విధించడంతో రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనే ఆందోళన నెలకొంది. సగటున నెలకు 3 లీటర్ల వంటనూనె వినియోగించే కుటుంబానికి మూడేళ్ల క్రితం రూ.270 మాత్రమే ఖర్చవగా.. ఇప్పుడు రూ.541 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. అంటే సగటున 100 శాతం పెరిగింది.

బ్రాండెడ్‌ టీపొడి ధర గతంలో కిలో రూ.540 ఉండేది. ప్రస్తుతం రూ.780 చొప్పున విక్రయిస్తున్నారు. అల్లం, యాలకులు, తులసి, అశ్వగంధ వంటి ఉత్పత్తులతో తయారయ్యే ఒక సంస్థ టీ పొడి.. 2019లో రూ.380 ఉండేది. ప్రస్తుతం రూ.560కి చేరింది. లీటర్ పాల ధర గతంలో రూ.55 నుంచి రూ.58 మధ్య ఉండేది. ఇప్పుడు సగటున రూ.64 నుంచి రూ.68 వరకు ఉంది. నెలకు 30 లీటర్లకు రూ.300 అదనంగా ఖర్చవుతోంది. సబ్బులు, డిటర్జెంట్‌ ఉత్పత్తుల ధరలూ.. 30 శాతం వరకు పెరిగినట్లు అంచనా. ఫేస్‌క్రీమ్‌, షాంపూ ధరలూ రెట్టింపయ్యాయి. పాత్రలు కడిగే సబ్బు ధర మూడేళ్ల కిందట రూ.45 ఉంటే ఇప్పుడు అది 51 శాతం పెరిగి.. రూ.68కి చేరింది. టూత్‌పేస్ట్‌ ధర 2019లో రూ.79 ఉంటే.. ఇప్పుడు రూ.96 రూపాయలకు పైగానే ఉంది.

ఇదీ చదవండి..

మత్తులో పేట్రేగుతున్న మృగాళ్లు.. మహిళలపై సామూహిక అత్యాచారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.