Bullet in monkey shoulder : కుక్కల దాడిలో గాయపడిన ఓ కోతికి వైద్యం చేస్తున్న సమయంలో.. వానరం భుజంలో తూటాని వైద్యులు గర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడలో ఒకకోతి పై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వానరాన్ని కొందరు భీమవరంలోని ప్రవేటు పశువైద్యశాలకి తరలించారు. చికిత్స చేస్తున్న సమయంలో డాక్టర్ సాయితేజ.. కోతి భుజంలో తూటా గాయాన్ని గమనించారు. వెంటనే వానర శరీరం నుంచి తూటాను తొలగించి చికిత్స అందించారు.
సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసులు తూటను పరిశీలించారు. ఇది బుల్లెట్ కాదని ఆక్వా చెరువుల వద్ద పక్షుల్ని కొట్టడానికి ఉపయోగించే ఫిల్లెట్ అని నిర్ధరించారు.