ETV Bharat / city

'అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం' - 2020-21 ST Special Progress Fund Rs. 12,304.23 crores

అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్య ప్రధాన సూత్రమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదికి ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.21,306.85 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ.12,304.23 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Budget for the financial year of 2020-21 for the progress of Telangana SCs and STs
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
author img

By

Published : Mar 18, 2021, 3:07 PM IST

షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని ప్రవేశపెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల జనాభా దామాషాననుసరించి, కొన్ని సందర్భాల్లో దామాషాకు మించి కూడా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నిధులను కేవలం వారి వికాసం కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ ప్రజల అభ్యున్నతి కోసం కేటాయించిన నిధులను ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఖర్చు చేయకపోతే మిగిలిన నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా చట్టంలో నిబంధన పెట్టామని హరీశ్ రావు చెప్పారు. ఈ విధమైన నిబంధన దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రమే ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఇటీవలే రాజస్థాన్ ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఈ విధానాన్ని అధ్యయనం చేసి వారి రాష్ట్రంలో కూడా అనుసరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ చట్టాన్ని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిలో ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఉద్ఘాటించారు. ఎస్సీ, ఎస్టీ ప్రగతి నిధి ద్వారా ఖర్చు చేసిన నిధుల వివరాలను, అమలు చేసిన కార్యక్రమాల వివరాలు గతేడాది నుంచి శాసనసభ సభ్యులందిరికీ పెన్​డ్రైవ్ ద్వారా అందజేస్తున్నామని, ఈ ఏడాది కూడా అదే విధంగా అందిస్తున్నామని తెలిపారు.

  • విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న షెడ్యూల్ తెగలకు చెందిన 180 మంది విద్యార్థుల కోసం 27.78 కోట్ల రూపాయలు కేటాయింపు
  • డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్​ కోసం 107.8 కోట్లు కేటాయింపు
  • బీటీ రోడ్డు సౌకర్యంలేని ఎస్టీ నివాస సముదాయాలకు(హాబిటేషన్లకు) 165 కోట్ల రూపాయల నిధులు కేటాయింపు
  • ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్ అందించడానికి రూ.18 కోట్ల రూపాయలు ప్రతిపాదన
  • గిరిజన వ్యవసాయ భూములన్నింటికీ త్రీఫేజ్ కరెంట్ సరఫరా కోసం రూ.103 కోట్ల నిధులు కేటాయింపు
  • ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.21,306.85 కోట్ల రూపాయలు కేటాయింపు
  • ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ.12,304.23 కోట్ల నిధులు కేటాయింపు

ప్రత్యేక గురుకులాలు

ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు విద్యావిషయంగా ఉన్నతమైన అభివృద్ధి పొందడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసింది. ఈ విద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, శిక్షణను అందిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి ఎస్సీ గురుకులాల్లో 82,063 మంది విద్యార్థులు చదువుతుండగా.. ఇప్పుడు 1,45,985 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఎస్సీ గురుకుకాల కోసం 2014 లో 590.60 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా 2019-20 నాటికి 898 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం.

- హరీశ్ రావు ,రాష్ట్ర ఆర్థిక మంత్రి

ఎస్టీ బాలురి కోసం లా కాలేజీ

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యా వికాసం కోసం చేస్తున్న కృషిని బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా గుర్తించింది. దేశవ్యాప్తంగా లా కాలేజీల మంజూరీపై ఉన్న మారటోరియాన్ని సడలించి, మన రాష్ట్రంలో రెండు గురుకుల ఇంటిగ్రేటెడ్ లా కాలేజీలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా ఎస్టీ బాలుర కోసం న్యాయవిద్యా గురుకుల కళాశాలను సంగారెడ్డిలో ఏర్పాటు చేసింది. ఎస్సీ,ఎస్టీ బాలికల కోసం ఎల్బీనగర్​లో మరో న్యాయవిద్యా గురుకులాన్ని ప్రారంభించింది.

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్​ షిప్

దేశంలో ఎక్కడాలేని విధంగా విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న షెడ్యూల్ కులాల విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్పులను ప్రభుత్వం అందజేస్తోందని మంత్రి హరీశ్ తెలిపారు. ఇప్పటి వరకు 623 మంది విద్యార్థులు ఈ స్కాలర్​షిప్​ అందుకున్నట్లు వెల్లడించారు. దానికోసం 107.8 కోట్ల రూపాయల మొత్తాన్ని స్కాలర్​షిప్పుల కోసం ప్రభుత్వం వెచ్చించిందని వివరించారు.

టీఎస్​-ప్రైడ్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అండగా నిలిచేందుకు టీఎస్​-ప్రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి పావలా వడ్డీ రుణాలు, విద్యుత్ రాయితీలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీని 35 శాతం నుంచి 45 శాతానికి పెంచింది. సేల్స్ టాక్స్ మినహాయింపును 100 శాతానికి పెంచింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ,ఎస్టీలకు పరిశ్రమల స్థాపన కోసం 39,590 యూనిట్లను 1,919 కోట్ల రూపాయల సబ్సిడీతో మంజూరు చేశాం.

- మంత్రి హరీశ్ రావు

ఇదీ చూడండి : 'పేదలకు కార్పొరేట్‌ తరహాలో వైద్యసేవలు అందించేందుకు సంస్కరణలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.