ETV Bharat / city

దారి చూపిన ధారావి... కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు - ధారావి కరోనా వార్తలు

కనుచూపుమేర ఎక్కడ చూసినా గుడిసెలే. అడుగుపెట్టే సందు ఉండదు. మురుగునీటి దుర్వాసనతో ఊపిరి సలపదు. ఇదీ ముంబయి మహానగరంలోని ధారావి వాతావరణం. దాదాపు 8.5 లక్షల జనాభా. వందలాది పరిశ్రమలు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ.. దేశంలో కరోనా విస్తరిస్తున్న వేళ అంతా భయపడింది ఈ ప్రాంతం గురించే. ఎడం, పరిశుభ్రతకు ఎండమావంత దూరంలో ఉండే ఈ బస్తీకి మహమ్మారి వస్తే.. ఇక విలయమే. అంతా అనుకున్నట్లే జరిగింది. మరీ ఎలా కట్టడి చేశారు..

dharavi
dharavi
author img

By

Published : Jun 29, 2020, 1:58 PM IST

ధారావి... ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. కరోనా విజృంభిస్తోన్న అందరి ఆందోళన ఆ ప్రాంతంపైనే. అక్కడ ఒక్క వచ్చినా.. విజృంభణే. ఏప్రిల్‌ 4న ఇక్కడ తొలి కేసు నమోదైంది. మే నెలకు ఆ సంఖ్య 1,216కు చేరింది. ఈ నెలలో కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కోలుకోవడం వెనక అక్కడి మున్సిపల్‌ యంత్రాంగం కృషి ఉంది. దృఢ నిశ్చయంతో అందరినీ ముందుండి నడిపించిన ఓ ఐఏఎస్‌ అధికారి సమర్థత ఉంది. ఆయనే బృహత్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) సహాయ కమిషనర్‌ కిరణ్‌ దిగావ్‌కర్‌. హైదరాబాద్‌లోనూ వందలాది బస్తీలు ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో ‘ఈనాడు’ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. కొవిడ్‌ కట్టడిలో తాము అనుసరించిన దారుల్ని ఆయన వివరించారు.

విరామమెరుగక శ్రమించి

దాదాపు 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఒక్కో చదరపు కి.మీకు 2,27,136 జనసాంద్రత. ఇలాంటి ప్రాంతంలో ఎడం పాటించడం కష్టం కావున వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో 47,500 ఇళ్లలో సర్వే చేశాం. 3.6 లక్షల మందికి స్క్రీనింగ్‌, మరో 15 వేల మందికి సంచార కేంద్రాల ద్వారా పరీక్షలు చేయించాం. వయసు పైబడిన 8,246 మందిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాం.

ఆ నాలుగిం‘టి’తో

ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌.. ఈ నాలుగే కరోనా వ్యాప్తిని కట్టడి చేశాయి. బాధితులను ఎప్పటికప్పుడు దూరంగా తరలించాం. పౌష్ఠికాహారం అందించాం.

కంటెయిన్‌మెంట్‌ కేంద్రాల ఎంపిక

ఇక్కడ ఎడం అసాధ్యం కనుక పాఠశాలలు, మైదానాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చి బాధితులను తరలించాం. ఇదే మా ప్రథమ విజయం. తరచూ మూత్రశాలల్లో క్రిమి సంహారక మందుల పిచికారి, ఫీవర్‌ క్లినిక్స్‌ భాగస్వామ్యం, అత్యవసర సిబ్బందికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు.. ఓ ప్రణాళికాబద్ధంగా చేయడం కలిసొచ్చింది.

హైదరాబాద్‌లో బస్తీలకు ముప్పు!

హైదరాబాద్‌ నగరంలో వందలాది ఇరుకు బస్తీలున్నాయి. పాతబస్తీ, టోలిచౌకి, బోరబండ, గోషామహల్‌, నాంపల్లి డివిజన్ల పరిధిలో జనసాంద్రత ఎక్కువ. తక్కువ ఖర్చులో జీవించేందుకు వలస జీవుల్లో ఎక్కువ మంది ఈ ప్రదేశాలకే మొగ్గు చూపుతుంటారు. కరోనా కేసులు నగరంలో 10 వేలు దాటిన నేపథ్యంలో బస్తీలకు మహమ్మారి ముప్పు ఎక్కువుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చార్మినార్‌ పరిధిలో ఉన్న ఘాన్సీబజార్‌లో ఒకే కుటుంబంలో 16 మందికి కరోనా సోకగా.. వారం వ్యవధిలో అదే కుటుంబంలో తండ్రి, కుమారులు మృతి చెందారు. ఇదే గల్లీలో బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాదిమంది జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో వ్యాప్తి 10 శాతం ఉంది. దీన్ని కట్టడి చేసేందుకు ‘ధారావి’ దారిలో నడవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ బస్తీల్లో మొత్తం 2187 మందికి చికిత్స అందించగా 50 శాతం ఆరోగ్యవంతులయ్యారు. 75 శాతానికిపైగా 21-60 ఏళ్ల మధ్య వయసున్న వారే కొవిడ్‌ బాధితులయ్యారు. వీరిలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందే ఎక్కువ ఉన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.