ETV Bharat / city

ఆ కారణంతో.. నిమ్స్​లో నర్సుల విధులు బహిష్కరణ

Boycott of nurses duties in NIMS: హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్‌లో నర్సులు విధులు బహిష్కరించారు. హెడ్ నర్సును టెక్నీషియన్ తిట్టాడన్న కారణంతో వారు విధులు బహిష్కరించారు. తక్షణమే ఆ టెక్నీషియన్​ను విధులు నుంచి తొలగించాలని నర్సులు కోరారు. నర్సుల విధుల బహిష్కరణ వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

author img

By

Published : Oct 12, 2022, 1:15 PM IST

nims
హైదరాబాద్​ నిమ్స్​

Boycott of nurses duties in NIMS: హెడ్​ నర్సును టెక్నీషియన్​ తిట్టాడని నర్సులు విధులు బహిష్కరించిన సంఘటన హైదరాబాద్​ నిమ్స్​లో జరిగింది. హైదరాబాద్‌ పంజాగుట్ట నిమ్స్‌లో నర్సులు విధులు బహిష్కరించారు.హెడ్ నర్సును టెక్నీషియన్ తిట్టాడని నర్సులు విధులు బహిష్కరించారు. రవితేజ అనే టెక్నీషియన్ నర్సులతో తప్పుగా మాట్లాడారని నిమ్స్ నర్సెస్ యూనియన్ జనరల్ సెక్రటరీ విజయలక్ష్మి ఆరోపించారు. అతన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.

అతనితో పాటు ధరణి అనే మరో అమ్మాయి తప్పుగా మాట్లాడిందన్నారు. వారిద్దరూ కాంట్రాక్ట్ ఉద్యోగులేనన్న విజయలక్ష్మి తెలిపారు. ఇద్దరిని తక్షణం విధుల నుంచి తొలగించాలన్నారు. అధికారులు చర్యలు తీసుకుంటారని భావించామని.. కానీ అలా జరగకపోవడంతో విధులు బహిష్కరించామని వెల్లడించారు. నర్సుల విధుల బహిష్కరణతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీపీఆర్ చేయకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూ రోగులు ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.