Bodybuilder Constable From Hyderabad : హైదరాబాద్‌లోని కార్వాన్‌కు చెందిన డీఏ కుమార్.. లంగర్‌హౌజ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన కుమార్.. 2010లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. కుమార్ తండ్రి ఓ పహిల్వాన్. ఆయనను చూస్తూ పెరిగిన ఇతడికి బాడీ బిల్డింగ్‌పై క్రమంగా మక్కువ పెరిగింది. అలా.. జిమ్‌లో కసరత్తులు చేయడం మెుదలుపెట్టాడు.
ఫిట్‌నెస్‌తో షురూ..
Bodybuilder Constable in Hyderabad : మెుదట్లో కేవలం ఫిట్‌నెస్ కోసం మెుదలుపెట్టినా.. క్రమంగా బాడీబిల్డింగ్ పోటీలపై ఆసక్తి పెంచుకున్నాడు. అలా.. 2019 నుంచి వివిధ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు. కండలు తిరిగిన దేహంతో అనేక పోటీల్లో పతకాలు సాధించాడు. అలా..2020లో మిస్టర్ గద్వాల్ పోటీల్లో మెుదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తరువాత కరోనా ఆంక్షలు రావడంతో.. పోటీలకు దూరంగా ఉన్నాడు.
మిస్టర్ ఇండియాలో టాప్-5
Bodybuilder Constable Kumar :2021లో నిజామాబాద్‌లో జరిగిన అజ్వాద్ ఖాన్ మిస్టర్ తెలంగాణా క్లాసిక్ టోర్నీలో 4వ స్థానంలో నిలిచాడు. ఎన్‌పీసీ రాష్ట్ర స్థాయి మిస్టర్ తెలంగాణ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచాడు. మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొనే అర్హత సాధించాడు. గతేడాది దిల్లీలో జరిగిన మిస్టర్ ఇండియా-2021 పోటీల్లో టాప్-5లో నిలిచాడు.
"పోలీసు శాఖ నుంచి ఇప్పటి వరకు మిస్టర్ ఇండియాలో ఎవరూ పాల్గొనలేదు. నేనే మొదటి వ్యక్తిని. నాకు బాడీ బిల్డింగ్‌పై మక్కువ మా నాన్నను చూసి కలిగింది. ప్రతిరోజు 3 గంటలు జిమ్‌లో గడుపుతాను. రోజుకు 6 సార్లు ఆహారం తీసుకుంటాను. తిండికి తగ్గట్టుగా వ్యాయామం చేస్తాను. నా మీల్స్ అన్నీ నా భార్యే వండుతుంటుంది."
- కుమార్, బాడీ బిల్డర్/ కానిస్టేబుల్
తెలంగాణ నుంచి ఏకైక వ్యక్తి..
Bodybuilder Constable Kumar From Hyderabad : ఈ ఏడాది ఖమ్మంలో నిర్వహించిన మిస్టర్ ఇండియా-2022 టోర్నీలో టాప్ 10లో చోటు సంపాదించాడు. ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాల నుంచి 600మంది బాడీబిల్డర్లు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసుల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న తొలి వ్యక్తిగా నిలిచాడు..కుమార్.
"ఆయన ఇటు డ్యూటీ.. అటు బాడీబిల్డింగ్‌తో ఎప్పుడు బిజీగా ఉంటారు. అప్పుడప్పుడు తినడానికి టైం దొరకదు. అలాంటి సమయంలో నేను వంట చేసి స్టేషన్‌కు పంపిస్తాను. ఇప్పటి వరకు నా భర్త ఎన్నో పతకాలు సాధించారు. ఆయణ్ని చూసి నాకెంతో గర్వంగా ఉంటుంది."
- వర్ష, కుమార్ భార్య
"వచ్చే జీతంలో సగానికంటే ఎక్కువగా బాడీబిల్డింగ్ కోసమే ఖర్చు చేస్తున్నాడు. మిస్టర్ ఇండియా వంటి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. పోలీసుల తరఫున జరిగే ప్రతి కార్యక్రమంలో అతను పాల్గొనేలా చూస్తున్నాం. మా శాఖలో జరిగే ప్రోగ్సామ్స్‌లో తన డైట్, ఆహారానికి అయ్యే ఖర్చు మేం చూసుకుంటున్నాం కానీ ఇతర పోటీల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు మాత్రం తాను ఆర్థికంగా కొంత కష్టపడుతున్నాడు. ఎవరైనా స్పాన్సర్లు.. తన ఆసక్తిని గమనించి స్పాన్సర్ చేస్తే తను మన దేశానికే కీర్తి తీసుకువస్తాడు. పోలీసు శాఖ తరఫున కుమార్‌కు మేం అన్ని రకాలుగా అండగా ఉంటాం. యువతతో పాటు పోలీసు ఉద్యోగులు ఫిట్‌నెస్ విషయంలో ఇతడిని స్ఫూర్తిగా తీసుకోవాలి"
- శ్రీనివాసులు, లంగర్‌హౌజ్ ఇన్స్‌పెక్టర్
చూశారు కదా..! తనకిష్టమైన బాడీబిల్డింగ్ కోసం వేల రూపాయలు ఇష్టంగా ఖర్చు చేస్తున్నాడు. రానున్న రోజుల్లో పోలీసు శాఖ తరపున జరిగే పోటీల్లో పాల్గొని.. మంచి గుర్తింపు సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.