Boat races in prakasam: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో తెప్పల పోటీలు నిర్వహించారు. చీరాల, వేటపాలెం, బాపట్ల మండలాల్లోని 30 మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సముద్రంలో హోరాహోరీగా జరిగిన పడవల పోటీల్లో.. కోడూరివారిపాలానికి చెందిన నాగరాజు మొదటి బహుమతిగా రూ.10 వేలు గెలుపొందారు.
సముద్రంలో పడవల పోటీలు తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ పోటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల్లో పోటీతత్వం ఏర్పడుతుందని.. ఏపీ మత్స్యకార సంక్షేమ సమితి అధ్యక్షుడు పొలంగారి పోలయ్య అన్నారు.
ఇదీ చదవండి: Kanuma: కనుమ.. పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ