ETV Bharat / city

సోనూసూద్​కు మరోసారి బీఎంసీ నోటీసులు - bmc brihan mumbai corporation sent notices to sonu sood

ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్​కు బీఎంసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో నివాస ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై కూల్చివేత నోటీసులు జారీ చేసింది. అయితే సోనూసూద్​కు హైకోర్టులో స్టే లభించింది. తాజాగా మరోసారి ఈ భవనంపై బీఎంసీ నోటీసులు జారీ చేసింది.

సోనూసూద్​కు మరోసారి బీఎంసీ నోటీసులు
సోనూసూద్​కు మరోసారి బీఎంసీ నోటీసులు
author img

By

Published : Dec 6, 2021, 2:27 PM IST

ప్రముఖ నటుడు సోనూ సూద్​కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మరోసారి నోటీసు జారీ చేసింది. సోనూసూద్‌ నివాస భవనాన్ని హోటల్​గా మార్చారని.. అది చట్ట విరుద్ధమని జారీ చేసిన నోటీసులో పేర్కొంది.

నవంబర్ 15న ఈ నోటీసు జారీ చేశారు. దీంట్లో నివాస స్థలాన్ని హోటల్గా మార్చారని ఆరోపించారు. ఈ ఏడాది ప్రారంభంలో సోనూసూద్​ను ముంబయి హైకోర్టు విచారించింది. సోనుసూద్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. హోటల్​ను తిరిగి నివాస ప్రాంగణంగా పునరుద్ధరించడానికి సోనూ అంగీకరించారు.

గతంలో సోను సూద్ భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. ‘మీ భవనంలోని ఒకటి నుంచి ఆరో అంతస్తులో మీరు బస/బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు మీరు లేఖలో పేర్కొన్నారు. మంజూరైన ప్లాన్ ప్రకారం ఆ భవనం నివాస అవసరాలను ఉపయోగిస్తామని మీరు పేర్కొన్నారు. పునరుద్ధరణకు అవసరమైన పని పురోగతిలో ఉందని మీరు చెప్పారు.' అని బీఎంసీ నోటీసులో పేర్కొంది.

కరోనా మహమ్మారి పీడించిన గడ్డు కాలంలో సోనూ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందించారు. ్నేక మంది దాతలు సోనూకు అండగా నిలిచారు. రియల్‌ హీరోపై జరిగిన ఐటీ దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయనకు సంబంధించిన అన్ని ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో రూ. 20కోట్లకుపైగా ట్యాక్స్ ఎగ్గొట్టారని ఐటీ అధికారులు ఆరోపించారు. ఈ దాడుల సమయంలో సోనూసూద్‌కు దేసవ్యాప్తంగా అభిమానులు, నెటిజన్లు మద్దతుగా నిలిచారు.

ఇదీ చూడండి: విలన్​గా నటించడానికి రెడీ: హీరో బాలకృష్ణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.